తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ పోలింగ్​ ప్రశాంతం.. 49 శాతం ఓటింగ్​​ నమోదు - స్థానిక ఎన్నికలు కశ్మీర్

DDC polls
స్థానిక సమరం

By

Published : Dec 1, 2020, 7:21 AM IST

Updated : Dec 1, 2020, 8:09 PM IST

17:04 December 01

పోలింగ్​ ప్రశాంతం..

జమ్ముకశ్మీర్​లో స్థానిక సంస్థల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల మినహా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్​ ప్రక్రియ సజావుగా సాగింది. మొత్తం 48.62 శాతం పోలింగ్​ నమోదైంది. 

11:51 December 01

ఓటింగ్ శాతం

జమ్ముకశ్మీర్​లో పోలింగ్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 23.6 శాతం పోలింగ్ నమోదైంది.

11:13 December 01

ఓటు హక్కు వినియోగించుకున్న 135 ఏళ్ల వృద్ధురాలు

135 ఏళ్ల వృద్ధురాలు..

పూంఛ్​ జిల్లా సూరన్​కోటెలో 135 ఏళ్ల లాల్​ షేక్​ అనే వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

11:11 December 01

బోగస్​ ఓట్లు..

డీడీసీ ఎన్నికల ఓటింగ్​లో అవకతవకలు బయటపడ్డాయి. బందిపొరాలోని గన్​స్టన్​ పోలింగ్​ కేంద్రంలో ఏజెంట్లు బ్యాలెట్​ బాక్స్​లను ఎత్తుకెళ్లారు. బోగస్​ ఓటింగ్​కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

09:06 December 01

గందేర్బల్​ జిల్లా మార్గుండ్​ గ్రామంలో స్థానిక ఎన్నికల ఓటింగ్​ ప్రశాంతంగానే సాగుతోంది. 

08:54 December 01

పటిష్ఠ భద్రత..

పటిష్ఠ భద్రత మధ్య జమ్ముకశ్మీర్​ ఉధంపుర్​లోని పంచారీలో ఓటింగ్​ జరుగుతోంది.

08:48 December 01

శ్రీనగర్..

శ్రీనగర్​లోని బల్​హామాలో పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

07:08 December 01

జమ్ముకశ్మీర్​: రెండో విడత పోలింగ్​ షురూ

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నేడు రెండో విడత పోలింగ్ మొదలైంది. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. రెండో విడత ఎన్నికల్లో మొత్తం 43 స్థానాలకు గాను 321 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కశ్మీర్​ డివిజన్​లో 25, జమ్ము డివిజన్​లో 18 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుంది.

కశ్మీర్ డీడీసీ ఎన్నికలను మొత్తం 8 విడతల్లో నిర్వహిస్తోంది ప్రభుత్వం. నవంబర్​ 28న జరిగిన తొలి దశ పోలింగ్​లో 52 శాతం ఓటింగ్ నమోదైంది. డిసెంబర్​ 19న మలి విడత పోలింగ్ జరగనుంది. 22న ఫలితాలు వెలువడుతాయి.

రెండో విడతలో 83 సర్పంచ్ స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరుగుతున్నట్లు జమ్ముకశ్మీర్ ఎన్నికల కమిషనర్ కేకే శర్మ తెలిపారు. మొత్తం 223మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు.

Last Updated : Dec 1, 2020, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details