భారత్‌లో కరోనా వ్యాక్సిన్ల వినియోగం, అనుమతులపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఆదివారం కీలక ప్రకటన చేయనుంది. ఉదయం 11 గంటలకు డీసీజీఐ డైరెక్టర్ జనరల్ మీడియాతో మాట్లాడనున్నారు. టీకా అందుబాటులోకి వచ్చే విషయంపై వివరాలు వెల్లడించనున్నారు.
మరోవైపు, భారత్ బయోటెక్ తయారుచేసిన 'కొవాగ్జిన్' టీకా అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ ఆమోద ముద్ర వేసింది. షరతులతో కూడిన ఆమోదం తెలపాలని డీసీజీఐకి సిఫార్సు చేసింది. ఆక్స్‌ఫర్డ్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ అత్యవసర వినియోగం కోసం సిఫారసులు చేసిన 24 గంటల్లోపే కొవాగ్జిన్‌కు అనుమతివ్వాలని నిపుణుల కమిటీ భావించింది. కొవిషీల్డ్‌ను ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా సంయుక్తంగా అభివృద్ధి చేయగా.. భారత్‌కు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది.