మరో స్వదేశీ కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ). ఫార్మా దిగ్గజ సంస్థ జైడస్ కాడిలా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ క్యాండిడేట్ ఇప్పటికే జంతువులపై ప్రయోగించి విజయవంతమైంది. ఇక వ్యాక్సిన్ మానవులపై ఏమేరకు పనిచేస్తుందో పరీక్షించేందుకు అనుతిచ్చింది డీసీజీఐ.
జంతువులపై ప్రయోగాన్ని క్షుణ్నంగా పరిశీలించాక మానవులపై రెండు దశల్లో ప్రయోగించేందుకు ఇది సరైనదిగా ధ్రువీకరించింది డీసీజీఐ.
"జైడస్ కాడిలా ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ను ఎలుక, కుందేలు, పందులు వంటి జంతువులపై ప్రయోగించింది. ఆ నివేదికను డీసీజీఐకు సమర్పించింది. ఆ ప్రయోగాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేశాక.. వ్యాక్సిన్ ఇచ్చిన కొద్ది గంటలకే జంతువుల శరీరంలో కరోనా వైరస్ను ఎదుర్కొనే.. యాంటియాక్సిడెంట్లు విడుదల అవుతున్నట్లు తేలింది. జంతువులపై ప్రయోగం విజయవంతమైంది కనుక మానవులపై ప్రయోగానికి జైడస్ కాడిలాకు అనుమతి దక్కింది."