తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాక్సిన్ ట్రయల్స్​పై సీరం సంస్థకు షోకాజ్ నోటీసులు - ఆస్ట్రాజెనికా ట్రయల్స్ నిలిపివేత

కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ).. సీరం ఇన్​స్టిట్యూట్​కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ ట్రయల్స్ ఇతర దేశాల్లో నిలిచిపోయినప్పటికీ భారత్​లో కొనసాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

dcgi notice to Serum Institute of India
సీరం​కు డీసీజీఐ షోకాజ్ నోటీసులు

By

Published : Sep 10, 2020, 6:01 AM IST

Updated : Sep 10, 2020, 8:08 AM IST

భారత్‌లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న పుణెలోని సీరం ఇన్సిస్టిట్యూట్ ఆఫ్‌ ఇండియాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఇతర దేశాల్లో ఆస్ట్రాజెనికా పరీక్షలను నిలిపివేసినప్పటికీ, భారత్‌లో కొనసాగడంపై డీసీజీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆస్ట్రాజెనికా క్లినికల్‌ ట్రయల్స్‌ నిలిపివేత సహా అందుకు గల కారణాలను సమర్పించకపోవడాన్ని డీసీజీఐ తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో సీరంను ఆదేశించింది. ప్రజా భద్రత దృష్ట్యా సీరంకు ఇచ్చిన వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ అనుమతుల్ని ఎందుకు రద్దు చేయకూడదో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది.

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్​కు సంబంధించి బ్రిటన్​లో తలెత్తిన లోపాలేవీ భారత్​లో చోటుచేసుకోలేదని.. అందుకే క్లినికల్ ట్రయల్స్ కొనసాగిస్తామని సీరం ప్రకటించిన కొద్దిసేపటికే డీసీజీఐ నోటీసులు పంపింది.

ఇదీ చూడండి:ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ మూడోదశ​ ట్రయల్స్​ నిలిపివేత!

Last Updated : Sep 10, 2020, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details