దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. దేశీయ ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడెట్ కోవాగ్జిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)అనుమతులు ఇచ్చింది.
మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ప్రోటోకాల్‌తో పాటు తొలి, రెండో దశ ట్రయల్స్ తాత్కాలిక సమాచారాన్ని డీసీజీఐ నిపుణుల కమిటీ (ఎస్ఈసీ) ముందు భారత్ బయోటెక్ ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. తొలి రెండు దశల ట్రయల్స్ సమాచారాన్ని కమిటీ పరిశీలించినట్లు తెలిపారు. వివరణాత్మక చర్చల తర్వాత, మూడవ దశ అధ్యయనం రూపకల్పన సూత్రప్రాయంగా సంతృప్తికరంగా ఉందని కమిటీ అభిప్రాయపడిందన్నారు.