తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూతురు 'మోదీ పాట' పాడిందని తండ్రిపై దాడి - katihaar

ప్రధాని నరేంద్ర మోదీ కోసం పాట పాడిందని ఓ చిన్నారిపై పగతో ఆమె తండ్రిని ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లి  చితకబాదారు దుండగులు. బిహార్​లోని​ కటిహార్​ జిల్లా బిరార్​లో ఈ ఘటన జరిగింది.

కూతురు 'మోదీ పాట' పాడిందని తండ్రిపై దాడి

By

Published : Jun 20, 2019, 5:05 PM IST

సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఓ అమ్మాయి పాడింది. దీన్ని సహించని కొంత మంది ఆమెపై పగబట్టారు. ఆమె కుటుంబ సభ్యులను అప్పటి నుంచి అనుసరించడం మొదలుపెట్టారు. చిన్నారిపై కోపాన్ని ఆమె తండ్రిపై తీర్చుకున్నారు. రాత్రివేళ ఇంట్లోకి చొరబడి చిన్నారి తండ్రి అలంక్రిత్​ రాయ్​ను దుండగులు ఎత్తుకెళ్లారు . అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్పృహ కోల్పోయాక గంగానదీ తీరంలో వదిలేసి వెళ్లిపోయారు.

బిహార్​ కటిహార్​ జిల్లా బిరార్​ పోలీస్ స్టేషన్​ పరిధిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.

శునకం సాయంతో ఆచూకీ

అలంక్రిత్​ రాయ్​ కోసం వెతికిన కుటుంబ సభ్యులకు మొదట అతని ఆచూకీ తెలియలేదు. చివరకు జాగిలం సాయంతో రాయ్​ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. తీవ్రగాయాలతో పడి ఉన్న అతడిని కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అలంక్రిత్​ చికిత్స పొందుతున్నాడు.

"నిద్రపోతున్న వ్యక్తిని ఎత్తుకెళ్లారు. దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నదీతీరంలో వదేలిసి వెళ్లిపోయారు. జాగిలం సాయంతో రాయ్​ ఆచూకీ కనుగొన్నాం."
- రాయ్ కుటుంబ సభ్యురాలు

తన కూతురు మోదీ కోసం పాట పాడటం వాళ్లకు ఎందుకు నచ్చలేదో తెలియదని రాయ్​ చెప్పాడు. ఆరుగురు వచ్చి తనను ఇంట్లోనుంచి ఎత్తుకెళ్లి దాడి చేశారని తెలిపాడు.

ఇదీ చూడండి: బోధి వృక్షం నుంచి జలధారలు..!

ABOUT THE AUTHOR

...view details