తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా వ్యాక్సిన్​కు 'కో-విన్' యాప్​ - కరోనా టీకా కోసం కోవిన్

ప్రతి ఒక్కరికి టీకా పంపిణీని నిర్ధరించేందుకు కొవిన్ యాప్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రూపొందించింది. దీని ద్వారా టీకాల నిల్వను డిజిటల్‌గా ట్రాక్‌ చేసేందుకు వీలుంటుంది. వ్యాక్సిన్​ లభ్యత, సేకరణకు సంబంధించిన సమాచారాన్ని ఇందులో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే టీకా లబ్ధిదారుల గురించి సమాచారం ఇవ్వనుంది ఈ యాప్.

Co-WIN for COVID-19
కరోనా వ్యాక్సిన్​కు 'కో-విన్' యాప్​

By

Published : Dec 9, 2020, 5:45 AM IST

కొవిడ్​ 19 టీకా పంపిణీ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వ్యాక్సినేషన్​ను పూర్తిస్థాయిలో పర్యవేక్షించడంతో పాటు, ఎవరైనా టీకా కావాలనుకుంటే నమోదు చేసుకోవడానికి వీలుగా కో-విన్ పేరిట ఓ ఉచిత మొబైల్ యాప్​ను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ రూపొందించింది.

టీకా కోసం నమోదు చేసుకున్నవారి వివరాలు సహా వ్యాక్సినేషన్​కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని (డేటా) ఇందులో పొందుపరుస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం టీకా పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 'కో-విన్' దోహదపడుతుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మంగళవారం తెలిపారు.

కో-విన్ యాప్​లో 5 రకాల (అడ్మినిస్ట్రేటర్, రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, బెనిఫిషరీ ఎకనాలెడ్జ్​మెంట్, రిపోర్ట్) మాడ్యూళ్లు ఉంటాయి. వీటిద్వారా వ్యాక్సిన్​కు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారు. టీకా వేసిన తర్వాత క్యూఆర్​ ఆధారిత ధ్రువపత్రాలను కూడా అందజేస్తారు. అలాగే ఎన్ని వ్యాక్సిన్​ సెషన్లు నిర్వహించారు. వీటికి ఎంతమంది హాజరయ్యారు వంటి వివరాలను కూడా యాప్​లో ఉంచుతారు.

ABOUT THE AUTHOR

...view details