తెలంగాణ

telangana

కరోనా ఆంక్షల నడుమ.. మైసూర్​లో 'దసరా' ఉత్సవాలు

By

Published : Oct 17, 2020, 1:23 PM IST

కర్ణాటకలోని మైసూర్​లో ప్రతి ఏటా అత్యంత వైభవంగా సాగే దసరా ఉత్సవాలు.. ఈ ఏడాది కరోనా ఆంక్షల నడుమ ప్రారంభమయ్యాయి. మైసూర్​ రాజవంశీయుల ఇష్టదైవం చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ఆరంభించారు ముఖ్యమంత్రి యడియూరప్ప. కరోనా నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

Dasara festivities begin in Mysuru
మైసూర్​లో 'దసరా' ఉత్సవాలు షురూ

కరోనా నిబంధనల నడుమ మైసూర్​లో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పండుగగా ప్రతిఏటా 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలపై ఈ సారి కొవిడ్​ ప్రభావం పడింది.అయినప్పటికీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది.

చాముండి కొండపై ఉన్న అమ్మవారు, మైసూర్​ రాజవంశీయుల కులదైవం చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప. వేడుకల ప్రారంభ కార్యక్రమంలో బెంగళూరులోని శ్రీజయదేవ ఇన్స్​స్టిట్యూట్​ ఆఫ్​ కార్డియోవాస్కులర్​ సెన్సెస్​ అండ్​ రీసెర్చ్​ డైరెక్టర్​, కరోనా పరీక్షల నోడల్ అధికారి డాక్టర్​ సీఎన్​ మంజునాథ్​తోపాటు కరోనా పోరులో ముందుండి విశేష సేవలందించిన మరో ఆరుగురిని సన్మానించారు యడియూరప్ప.

కరోనా యోధులను సత్కరిస్తున్న యడియూరప్ప

410వ ఉత్సవాలు..

410వ దసరా ఉత్సవాలను నిరాడంబరంగా, సంప్రదాయాలను పాటించేలా నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. 10 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో రాష్ట్ర సంప్రదాయం ఉట్టిపడేలా జానపద కళలను ప్రదర్శిస్తారు. అయితే ప్రతి ఏటా వేడుకలు, ప్రదర్శనలను చూసేందుకు ప్రజలు, పర్యటకులు భారీ సంఖ్యలో వస్తారు. ఈ సారి కరోనా కారణంగా పలు కార్యక్రమాలపై మైసూర్​ అధికారులు ఆంక్షలు విధించి.. లైవ్​ ప్రసారం అందిస్తున్నారు.

కరోనా యోధులను సత్కరిస్తున్న యడియూరప్ప

జంబో సవారీ

ఈనెల 26వ తేదీన విజయ దశమి ( వేడుకల 10వరోజు) చాముండేశ్వరి అమ్మవారి జంబో సవారీ (ఏనుగుపై ఊరేగింపు) నిర్వహిస్తారు. ప్రతిఏటా అత్యంత వైభంగా.. లక్షల మంది ప్రజల సమక్షంలో ఈ ఊరేగింపు జరుగుతంది. మైసూర్​ ప్యాలస్​లోనూ దసరా ఉత్సవాలు నిర్వహించాలని రాజకుటుంబం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో చాలా తక్కువ సంఖ్యలో ఎంపిక చేసిన వారి సమక్షంలోనే ఈ వేడుకలు నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

ABOUT THE AUTHOR

...view details