తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూరగాయలకు డబ్బులడిగితే తలాక్ చెప్పేశాడు!

దేశ రాజధాని దిల్లీలోని గ్రేటర్​ నోయిడాలో కూరగాయలకు డబ్బులడిగిందన్న కారణంతో ఓ వ్యక్తి భార్యకు తలాక్ చెప్పేశాడు. అడిగిన డబ్బు ఇవ్వకపోగా భౌతికంగా హింసించాడు.

కూరగాయలకు డబ్బులడిగితే తలాక్ చెప్పేశాడు!

By

Published : Jul 1, 2019, 5:01 AM IST

కూరగాయలకు డబ్బులడిగితే తలాక్ చెప్పేశాడు!

కూరగాయల కోసం 30 రూపాయలడిగినందుకు భార్యకు తలాక్ చెప్పేశాడో భర్త. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలోని గ్రేటర్​ నోయిడాలో జరిగింది.

నోయిడాలోని జైనబ్​కు ఇదే ప్రాంతంలోని సాబీర్​తో తొమ్మిదేళ్ల కింద వివాహమైంది. అనంతరం సాబీర్ కుటుంబం నుంచి జైనబ్​కు వరకట్న వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయమై అనేక సార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది.

భర్త​ను కూరగాయల కోసం 30 రూపాయలు ఇవ్వాలని కోరింది జైనబ్. ఆగ్రహించిన సాబీర్ ఆమెపై భౌతిక దాడి చేశాడు. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్న జైనబ్​ తండ్రి సమక్షంలో జైనబ్​కు ముమ్మారు తలాక్ చెప్పేశాడు. గాయాలతో ఉన్న ఆమెను తండ్రి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాడు. అనంతరం దాదరీ పోలీసు స్టేషన్​లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు.

వివాహమైన కొద్ది రోజుల నుంచే సాబీర్ తమ కూతురిని వరకట్నం కోసం వేధించేవాడని వాపోయారు బాధితురాలి తల్లి. అనేకసార్లు పంచాయతీ నిర్వహించినప్పటికీ క్షమాపణలు చెప్పి తప్పించుకునేవాడన్నారు.

ఇదీ చూడండి: పులి వేట నుంచి తప్పించుకున్న బైకర్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details