మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు రోజురోజుకీ ఉత్కంఠను పెంచుతున్నాయి. సీఎం పీఠాన్ని చెరిసగం పంచుకోవాలనే విషయంపై శివసేన వెనక్కి తగ్గడం లేదు. ఈ ప్రతిపాదనకు అంగీకరించేది లేదని భాజపా ఇప్పటికే తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు కోసం శివసేనకు కాంగ్రెస్ మద్దతివ్వడంపై కొత్త చర్చ మొదలైంది.
శివసేనకు మద్దతివ్వాలని సోనియాకు లేఖ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేనకు మద్దతిచ్చే విషయంపై ఆలోచించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు ఆ పార్టీ ఎంపీ హుస్సేన్ దల్వాయి. భాజపా అతివాదంతో పోల్చితే శివసేన భావజాలం వేరు అని లేఖలో పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ నామినేట్ చేసిన రాష్ట్రపతి అభ్యర్థులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీలకు సేన మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు దల్వాయి.
అయితే... శివసేనకు మద్దతిచ్చే ప్రతిపాదనను కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున ఖర్గే, సుశీల్ కుమార్ శిందే, సంజయ్ నిరుపమ్ వంటి నాయకులు ఈ జాబితాలో ఉన్నారు.
స్వాగతించిన సేన