తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇటలీని దాటేసిన భారత్​- 24 గంటల్లో 9,887 కొత్త కేసులు

దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. కేసులపరంగా భారత్..​ ఇటలీని దాటిపోయింది. గడచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కొత్తగా 9,887 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 294 మంది ప్రాణాలు కోల్పోయారు.

daily corona virus updates
కరోనా కేసుల్లో ఇటలీని మించిన భారత్​

By

Published : Jun 6, 2020, 9:20 AM IST

Updated : Jun 6, 2020, 10:09 AM IST

దేశంలో లాక్​డౌన్ సడలింపుల తరువాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేసులపరంగా భారత్​ ఇటలీని మించిపోయింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకారం, గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,887 కొత్త కేసులు, 294 మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో ఇదే అత్యధికం.

ఇటలీని దాటేసిన భారత్​- 24 గంటల్లో 9,887 కొత్త కేసులు

ఆరో స్థానం..

కరోనా కేసుల సంఖ్య పరంగా భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. భారత్​ కంటే ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, స్పెయిన్, యూకే మాత్రమే ఉన్నాయి. అయితే కేసులు ఎక్కువ అవుతున్నా.. మరణాలు రేటు మాత్రం మాత్రం తక్కువగానే ఉండటం కాస్త ఊరట.

రాష్ట్రాలవారీగా

కొత్తగా నమోదైన 294 కరోనా మరణాల్లో.. మహారాష్ట్ర- 139, దిల్లీ- 58, గుజరాత్​- 35, తమిళనాడు- 12, ఉత్తర్​ప్రదేశ్​- 12, బంగాల్- 11, తెలంగాణ- 8, మధ్యప్రదేశ్- 7, రాజస్థాన్​- 5, ఆంధ్రప్రదేశ్​- 2; జమ్ము కశ్మీర్​, ఒడిశా, పంజాబ్​, ఝార్ఖండ్​, ఉత్తరాఖండ్​ల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

ఇదీ చూడండి:కరోనా కాలంలో 'యోగా డే' కోసం కేంద్రం కొత్త ప్లాన్

Last Updated : Jun 6, 2020, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details