కరోనా మహమ్మారి దేశంలో కోరలు చాస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్తగా 62,064 కేసులు నమోదవగా 1007 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 22 లక్షలు దాటింది.
కరోనా ఉగ్రరూపం: ఒక్కరోజులో 1,007 మంది మృతి - కరోనా అప్డేట్స్
దేశంలో కరోనా విలయం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. వరుసగా నాలుగో రోజు దేశంలో 60 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1007 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకుపైగా కేసులు నమోదవవుతున్నాయి. అయితే కొవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉండటం ఊరట కలిగిస్తోంది. దేశంలో 15 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారీ సంఖ్యలో చేపడుతున్న పరీక్షలు, అత్యుత్తమ వైద్య సేవలు తదితర చర్యల ద్వారా ఆశించిన ఫలితాలు వస్తున్నాయని పేర్కొంది. దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య.. ప్రస్తుతం ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య కంటే రెట్టింపుగా ఉందని వెల్లడించింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం పది రాష్ట్రాల నుంచే ఉన్నాయని పేర్కొంది.