తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీపీఐ ప్రధాన కార్యదర్శిగా రాజా - సీపీఐ

భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఎన్నికయ్యారు. నేడు జాతీయ కౌన్సిల్​ ముగింపు సమావేశంలో బాధ్యతలు స్వీకరించారు. పార్టీ నాయకులు, ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు రాజా. ప్రజల హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటం చేస్తామన్నారు.

సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా బాధ్యతల స్వీకరణ

By

Published : Jul 21, 2019, 3:37 PM IST

భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) జాతీయ కౌన్సిల్​ ముగింపు సమావేశంలో భాగంగా నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేశారు. సీపీఐ జాతీయ కౌన్సిల్​ సమావేశంలో భాగంగా రాజా నియామకంపై నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్ఠానం. ఆయన పేరును పార్టీ సిఫార్సు చేయగా సభ్యులందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు రాజా.

జాతీయ కౌన్సిల్​ సమావేశంలో మాట్లాడుతున్న డి.రాజా

"ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో పార్టీని నడిపించాలని నాపై ఇంత పెద్ద బాధ్యతను ఉంచినందుకు పార్టీ కామ్రేడ్​ సుధాకర్​రెడ్డి, పార్టీ జాతీయ కౌన్సిల్​కు నా కృతజ్ఞతలు. సీపీఐ, లెఫ్ట్​ పార్టీలు ఈ ప్రభుత్వంపైనా, ప్రభుత్వ హానికర విధానాలపైనా రాజీ లేని పోరాటం చేస్తూనే ఉంటాయి. ప్రజల ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది."

- డి.రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి.

ప్రస్తుతం తమిళనాడు నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజా. సుదీర్ఘకాలం పాటు పార్టీ జాతీయ నేతగా సేవలందించారు. ఎస్సీల సమస్యలపై అనేక పోరాటాలు చేశారు.

ఇదీ చూడండి: బ్యాలెట్​ పేపర్లు తిరిగి తీసుకురావాలి: మమత

ABOUT THE AUTHOR

...view details