అంపన్ తుపాను బంగాల్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. మృతుల సంఖ్య 80కి పెరిగింది.
తుపాను ధాటికి వంతెనలు, విద్యుత్ స్తంభాలు, ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇళ్లు కొట్టుకుపోయి, భవనాలు కూలిపడి కోల్కతా సహా దాదాపు 12 జిల్లాల్లో.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. కొన్ని జిల్లాల్లో మొబైల్, విద్యుత్ సేవలను పునరుద్ధరించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయక దళాల సిబ్బంది తీవ్రంగా శ్రమించి శరణార్థులను కాపాడుతున్నారు.
"అంపన్ ధాటికి కూలిన వేలాది చెట్లను తొలగిస్తున్నాం. కానీ, పునరుద్ధరించాల్సింది చాలా ఉంది. రెండు మూడు రోజుల్లో పరిస్థితిని సాధారణంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. అప్పటి వరకు ప్రజలను ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాం."
-ఫిర్హద్ హకీం, కోల్కతా మేయర్