పెనుగాలుల భీభత్సం సృష్టించిన నివర్ తుపాను ఎట్టకేలకు తీరం దాటింది. పుదుచ్చేరి సమీపంలో తీరం దాటి అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారింది. కానీ... తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో నివర్ తీవ్ర ప్రభావం చూపనుంది.
రానున్న మూడు గంటల్లో తుపాను తీవ్రత మరింత తగ్గి వాయువ్య దిశగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
తుపాను కారణంగా నేలకొరిగిన చెట్లు తీరం దాటిందిలా....
బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్ తుపాను తీరం దాటింది. తర్వాత పుదుచ్చేరి ప్రాంతంలో తుపాను ప్రభావం స్వల్పంగా తగ్గింది. 'నివర్' తీరం దాటిన 3 గంటల తర్వాత ఈశాన్య దిశగా వీచిన ఈదురు గాలులు 65-75 కిలోమీటర్ల వేగానికి తగ్గాయి.
తుపాను తీరం దాటే సమయంలో పుదుచ్చేరిలో 100-110 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశలో గాలులు వీచాయని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాలు ఇంకా అల్లకల్లోలంగా ఉన్నాయని, ప్రమాదం తొలగలేదని హెచ్చరించింది.
తుపాను తీరం దాటడానికి ముందు పుదుచ్చేరిలో జలమయమైన రోడ్లు
ఇదీ చదవండి:'చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. మెట్రో రైళ్లు బంద్'