తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫొనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి'

ఫొని తుపాను విజృంభిస్తున్న సమయంలో ఉన్నతాధికారులతో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించిన ఆయన... ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

'ఫొనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి'

By

Published : Apr 29, 2019, 10:25 AM IST

Updated : Apr 29, 2019, 11:53 AM IST

ఫొని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచన

దేశ ప్రజలను ఫొని తుపాను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరో 6 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'ఫొని' పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రధాని. ఉన్నతాధికారులతో సమీక్షించిన మోదీ.. విపత్తును ధైర్యంగా ఎదుర్కోవడంపై దిశానిర్దేశం చేశారు.

అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు తెలిపినట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు ప్రధాని.

''ఫొని తుపాను పరిస్థితిపై అధికారులతో మాట్లాడాను. ముందస్తు నివారణ చర్యలు, అవసరమైన సాయాన్ని అందించాలని సూచించాను. తుపాను ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని అధికారుల్ని ఆదేశించా. ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థించండి.''

- ప్రధాని మోదీ ట్వీట్​

క్రమక్రమంగా బలపడుతున్న 'ఫొని' రాబోయే 24 గంటల్లో పెను తుపానుగా మారనుందని వాతవరణ శాఖ తెలిపింది. మరో 3 గంటల్లో తీవ్ర తుపాను స్థాయికి చేరుతుంది.
దేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​లతో పాటు.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

Last Updated : Apr 29, 2019, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details