తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాను వణికిస్తోన్న ప్రచండ గాలులు - ఒడిశా

ఫొని తుపాను ఒడిశాను వణికిస్తోంది. 150 కిలోమీటర్ల వేగంతో వీస్తోన్న ప్రచండ గాలులకు ఇళ్లు, భవనాలు, వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది.

ఒడిశాను వణికిస్తోన్న ప్రచండ గాలులు

By

Published : May 3, 2019, 10:47 PM IST

ఒడిశాను వణికిస్తోన్న ప్రచండ గాలులు
ఫొని తుపాను బీభత్సానికి ఒడిశా వణికిపోతోంది. ప్రచండ గాలులకు జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీచాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.

గంజమ్​, పూరీ, జగత్సింగాపుర్​ జిల్లాల్లో సుమారు 165 కిలోమీటర్ల మేర గాలులు వీస్తున్నాయి. జిల్లాల్లోని పులుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.

ఒడిశా రాజధానిలో ప్రచండ గాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది. భువనేశ్వర్​లోని ఓ బహుళఅంతస్థులు నిర్మించేందుకు ఉపయోగించిన క్రేన్​ నేలకూలింది. ఇళ్ల పైకప్పులు, తలుపు, కిటికీలు వంటివి గాలులకు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాలుల బీభత్సానికి ఇళ్లలో నివసించే పరిస్థితులు లేవు. నగరంలోని ఓ వసతి గృహంలో విద్యార్థినులు తలుపు వేసేందుకు ప్రయత్నించి విఫలమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. భవనాలకు అమర్చిన గ్లాస్​ అద్దాలు పగిలిన పులువురు గాయపడ్డారు.

ఇదీ చూడండి:ఫొని బీభత్సం: గాలి వేగానికి నేల కూలిన క్రేన్​

ABOUT THE AUTHOR

...view details