ఫొని ప్రచండ తుపాను విధ్వంసానికి ఒడిశాలో మృతిచెందిన వారిసంఖ్య 34కి పెరిగింది. పూరీ జిల్లాలో అన్ని కుటుంబాలకు, కుర్దా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లోని కుటుంబాలకు 50 కేజీల బియ్యం, రూ. 2 వేల ఆర్థిక సాయం అందివ్వనున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ ప్రకటించారు.
కుర్దా జిల్లాలో మిగిలిన ప్రాంతాల వారికి నెలకు సరిపడా కోటా బియ్యం, రూ.1000 ఇవ్వనున్నారు. కటక్, కేంద్రపరా, జగత్‌సింగ్‌పూర్ జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలకు నెలకు సరిపడా కోటా బియ్యం, రూ.500 ఇవ్వనున్నారు
తుపాను వల్ల పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 95,100, పాక్షికంగా దెబ్బ తిన్న ఇళ్లకు రూ.52,000, స్వల్పంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.3,200 రూపాయల పరిహారం అందివ్వనున్నారు. పూరీ జిల్లాలో 70 శాతం ప్రాంతాలకు, రాజధాని భువనేశ్వర్ పరిధిలోని 40 శాతం ప్రాంతాలకు తాగునీటి సరఫరా పునరుద్ధరించినట్లు నవీన్‌పట్నాయక్ వెల్లడించారు.