తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బుల్​బుల్' తుపాను​ బీభత్సం- బంగాల్​లో 10 మంది బలి - బుల్​బుల్​ తుఫాన్​ వల్ల బంగాల్​లో 10 మంది

బుల్​బుల్​ తుపాను​ బంగాల్​ రాష్ట్రాన్ని వణికిస్తోంది. తుపాను వల్ల బంగాల్​లో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బంగాల్​లో 2.73 లక్షల మందిపై తుపాను ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్​లోనూ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి​ బంగ్లాలో 10 మంది మృతి చెందారు. 21 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

'బుల్​బుల్' తుపాను​ బీభత్సం- బంగాల్​లో 10 మంది బలి

By

Published : Nov 10, 2019, 8:17 PM IST

Updated : Nov 10, 2019, 8:59 PM IST

బంగాల్​లో బుల్​బుల్​ బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన 'బుల్​బుల్'​ తుపాను బంగాల్​ను​ వణికిస్తోంది. తుపాను సంబంధిత ప్రమాదాల్లో ఇప్పటి వరకు దాదాపు 10 మృతి చెందారు. సుమారు 2.73 లక్షల కుటుంబాలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు.

తుపాను ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లా, తూర్పు మిడ్నాపూర్​ జిల్లాలో వేగంగా వీచిన గాలులకు వందల వృక్షాలు, కేబుల్​ వైర్లు తెగిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. తీరప్రాంత జిల్లాలోని 2473 ఇళ్లు ధ్వంసం కాగా, మరో 26 వేల గృహాలు పాక్షికంగా నాశనమైనట్లు విపత్తు నిర్వహాణ సంస్థ తెలిపారు. అంతేకాకుండా 2.73 లక్షల కుటుంబాలు ప్రభావితమయ్యాయని, రాష్ట్రంలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సురక్షిత ప్రదేశాల్లో 1.78 లక్షల మందిని తరలించినట్లు వెల్లడించారు

బంగ్లాదేశ్​...

బుల్​బుల్​ తుపాను ప్రభావం బంగ్లాదేశ్​పైనా పడింది. తుపాను వల్ల 10 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ముందుగా ముంపు ప్రాంతాల్లోని 21 లక్షల మంది ప్రజలను 5 వేల సురక్షిత కేంద్రాలకు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'5 ఎకరాల భూమి స్వీకరణపై చర్చించాకే నిర్ణయం'

Last Updated : Nov 10, 2019, 8:59 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details