తీరం దాటిన తుపాను...
అతి తీవ్ర తుపాను అంపన్ ఎట్టకేలకు తీరం దాటింది. బంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియ దీవుల మధ్య ఈ ప్రక్రియ ముగిసింది. ఆ సమయంలో కనిష్ఠంగా 155-165 కి.మీ, గరిష్ఠంగా 185 కి.మీ వేగంతో వేగంతో ఈదురుగాలులు వీచాయి.
19:22 May 20
తీరం దాటిన తుపాను...
అతి తీవ్ర తుపాను అంపన్ ఎట్టకేలకు తీరం దాటింది. బంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియ దీవుల మధ్య ఈ ప్రక్రియ ముగిసింది. ఆ సమయంలో కనిష్ఠంగా 155-165 కి.మీ, గరిష్ఠంగా 185 కి.మీ వేగంతో వేగంతో ఈదురుగాలులు వీచాయి.
18:25 May 20
ఇద్దరు మృతి...
బంగాల్పై అంపన్ తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతోంది. తుపాను వల్ల రాష్ట్రంలో ఇద్దరు మరణించారు.
17:15 May 20
మరో 2 లేదా 3 గంటలు..
అంపన్ తీరం దాటేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు బంగాల్ తీరాన్ని తాకిన తుపాను.. రాత్రి 7.30 గంటల లోపు పూర్తిగా తీరం దాటి వెళ్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అతి తీవ్ర తుపానుగా ఉన్న అంపన్.. సుందర్బన్ సమీపంలోని హతియా దీవుల వద్ద తీరం దాటనున్నట్లు తెలుస్తోంది.
16:52 May 20
ఒడిశాకు తప్పిన ముప్పు..!
కోల్‌కతా, ఒడిశాలో అంపన్ తుపాను తీవ్రత అధికంగా ఉండటం వల్ల హోర్డింగులు, చెట్లు నేలకొరిగే అవకాశం ఉంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల వల్ల ఇళ్లు, రోడ్లు, పడవలు సహా టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం వరకు మాత్రమే ఈ ప్రభావం ఉంటుందని.. గురువారం నుంచి అంతా సద్దుమణిగిపోతుందని అధికారులు స్పష్టం చేశారు. బంగాల్‌లో చిన్నపాటి వర్షం కురవచ్చు. ఒడిశాలో రేపటి నుంచి సాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని, ఇప్పటికే భారీ ముప్పు తప్పినట్లు అంచనా వేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.
16:25 May 20
తుపాను బంగాల్ తీరాన్ని తాకడం వల్ల భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
15:44 May 20
బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా అంపన్
15:34 May 20
తీరాన్ని తాకిన అంపన్ అతి తీవ్ర తుపాను
భీకరగాలులతో బంగాల్ తీరాన్ని తాకిన అంపన్ అతి తీవ్ర తుపాను. పూర్తిగా తీరం దాటేందుకు నాలుగు గంటలు పడుతుందని స్పష్టం చేసిన వాతావరణ శాఖ. బంగాల్-బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ వద్ద తీరం దాటుతుందని అంచనా. ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన ఒడిశా, బంగాల్ తీర ప్రాంతాలు. ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
15:28 May 20
మరో నాలుగు గంటలు..
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి తీవ్రమైన గాలుల ముందుకొస్తున్న అంపన్ తుఫాను.. పూర్తిగా తీరం దాటి వెళ్లేందుకు దాదాపు 4 గంటల సమయం పడుతుందని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే తుపాను బంగాల్ తీరాన్ని తాకిందని తెలిపింది.
15:24 May 20
మరింత దగ్గరగా..
అంపన్ తుపాను గంటకు 105 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ.. బంగాల్‌లోని దిఘా వైపు దూసుకొస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది బంగాల్-బంగ్లాదేశ్ మధ్యలోని సుందరబన్‌కు దగ్గరగా ఉన్న హతియా దీవుల్లో వద్ద తీరం దాటనుందని స్పష్టం చేసింది. సుమారు 4 గంటల సమయంలో ఈ ప్రక్రియ జరగే అవకాశం ఉందని అంచనా వేసింది.
15:17 May 20
సురక్షిత ప్రాంతాలకు తరలింపు..
బంగాల్, ఒడిశాలోని తుపాను ప్రభావిత ప్రాంతల నుంచి 4.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.
15:04 May 20
బంగాల్‌కు తాత్కాలికంగా రైళ్ల సేవలు నిలిపివేత..
'అంపన్' తుపాను కారణంగా బంగాల్‌కు రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా రద్దవుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు హిమాచల్‌ప్రదేశ్ నుంచి బంగాల్‌కు బయలుదేరాల్సిన ఓ రైలును రద్దు చేసినట్లు ప్రకటించారు అధికారులు. ఇందులో ప్రయాణాంచాల్సిన దాదాపు 1400 మందికి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. వీలైనంత త్వరలో కొత్త తేదీ, సమయం వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
14:21 May 20
సాయంత్రం 4గంటలకు...
బుధవారం సాయంత్రం 4గంటల అనంతరం అంపన్ తుపాను తీరం దాటనుంది. ఉత్తర-ఈశాన్యంవైపు ప్రయాణిస్తున్న తుపాను.. బంగాల్-బంగ్లాదేశ్ తీరాలైన దిఘా- హతియా వద్ద తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వరకు ఈదురు గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
14:09 May 20
3నెలల శిశువు మృతి...
తీరం దాటకుండానే అంపన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఒడిశాలో భారీ ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. అయితే మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కంపాడ పంచాయతిలోని ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ 3నెలల మగ బిడ్డ ప్రాణాలు కోల్పోగా... అతడి తల్లి గాయాలతో బయటపడింది. రాత్రి పూట వారు పడుకుని ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
13:48 May 20
ముంచుకొస్తోంది...
బంగాల్ తీరంవైపు అంపన్ తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం దిఘాకు కేవలం 95 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. తుపాను పరిస్థితులను ప్రభుత్వం యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.
13:20 May 20
ఈరోజు సాయంత్రం అంపన్ తుపాను తీరం తాకనున్న నేపథ్యంలో బంగాల్‌లోని జోగేష్గంజ్, ఉత్తర 24 పరగణాల జిల్లాలో పశుసంపదను సురక్షితప్రాంతాలకు తరలిస్తున్నారు సహాయక సిబ్బంది.
12:46 May 20
ఒడిశాలో బీభత్సం...
అంపన్ తుపాను తీరం దాటకుండానే బీభత్సం సృష్టిస్తోంది. ఒడిశాలోని పారాదీప్తో పాటు రాజధాని భువనేశ్వర్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తుపాను ప్రస్తుతం బంగాల్‌లోని దిఘాకు 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సాయంత్రంలోగా తీరం దాటనుంది.
12:22 May 20
పారాదీప్‌లో...
ఒడిశాలోని పారాదీప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు గంటకు 102 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఫలితంగా చెట్లు కూలిపోతున్నాయి. రోడ్లపై కూలిన చెట్లను తొలగించడానికి అధికారులు శ్రమిస్తున్నారు.
11:41 May 20
కోల్‌కతాకు దగ్గరగా...
నేటి సాయంత్రానికి బంగాల్‌లోని దిఘా వద్ద అంపాన్ తుపాను తీరం దాటనుంది. ప్రస్తుతం దిఘాకు దక్షిణ- ఆగ్నేయ దిక్కున 177 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీరం దాటిన అనంతరం కోల్‌కతాకు సమీపానికి వచ్చే అవకాశముంది. రేపు ఉదయం వరకు తుపాను తీవ్రత అధికంగా ఉంటుందని కోల్‌కతా వాతావరణశాఖ డైరక్టర్ వెల్లడించారు.
11:25 May 20
ఒడిశాలో బీభత్సం...
ఒడిశాలో అంపన్ తుపాను ప్రభావం మొదలైంది. చాందిపుర్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు సాయంత్రానికి తుపాను తీరం దాటనుందని వాతావరణశాఖ పేర్కొంది.
11:14 May 20
నావికా దళం సిద్ధం...
అంపన్ తుపానను ఎదుర్కొనడానికి భారత నావికా దళం ముమ్మర చర్యలు చేపట్టింది. గాలింపు, సహాయక చర్యలు చేపట్టడానిక నావికా దళానికి చెందిన నౌకలు, విమానాలు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఆహార పొట్లాలు, బట్టలు తదితర వస్తువులు ఉన్నట్టి నావికా దళం పేర్కొంది.
10:36 May 20
నేటి సాయంత్రానికి...
అంపన్ తుపాను... ఉత్తర-ఈశాన్య వైపు ప్రయాణించి.. బంగాల్- బంగ్లాదేశ్ తీరాలైన దిఘా- హతియా వద్ద ఈ సాయంత్రానికి తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది.
10:08 May 20
అన్ని కార్యకలాపాలు నిలిపివేత...
అంపన్ తుపాను నేపథ్యంలో కోల్‌కతా విమానాశ్రయంలో రేపు ఉదయం 5గంటల వరకు ఎలాంటి కార్యకలాపాలు జరగవని ఎయిర్పోర్ట్ డైరక్టర్ తెలిపారు. కరోనా సంక్షోభంలో నడుపుతున్న ప్రత్యేక విమానాలు కూడా ఎగరవని స్పష్టం చేశారు.
09:52 May 20
'రానున్న 8 గంటలు కీలకం...'
ఒడిశాలోని పారాదీప్‌కు 110 కిలోమీటర్ల దూరంలో అంపన్ తుపాను కేంద్రీకృతమైంది. గంటకు 189 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకొస్తోంది. గాలుల వేగం గంటకు 102కి.మీలుగా ఉంది. ఈ రోజు సాయంత్రానికి బంగాల్‌లోని సుందర్బన్ వద్ద తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. రానున్న 6-8 గంటలు ఎంతో కీలకమని పేర్కొంది.
09:46 May 20
బంగాల్‌లో అలజడి...
బంగాల్‌లో అంపన్ తుపాను ఇప్పుడే ప్రభావం చూపుతోంది. తూర్పు మెదినిపుర్లోని దిఘాలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
09:40 May 20
పారాదీప్‌లో...
అంపన్ తుపాను నేపథ్యంలో ఒడిశాలోని పారాదీప్‌లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 102 కి.మీలో వేగంతో గాలులు విజృంభిస్తున్నాయి. నేటి మధ్యాహ్నానికి తుపాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 13 జిల్లాల్లోని 1,19,075మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వీరికోసం 1,704 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
09:12 May 20
బలమైన ఈదురు గాలులతో 'అంపన్' బీభత్సం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అంపన్ తుపాను ఈ రోజు తీరం దాటనుంది. సూపర్ సైక్లోన్ నుంచి తీవ్ర తుపానుగా మారినప్పటికీ అంపన్ ఒడిశా, బంగాల్ రాష్ట్రలపై తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. ఒడిశా పారాదీప్‌లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.