తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశా, బంగాల్​ను వణికించిన 'అంపన్​' - Tropical Cyclone Amphan latest news

అతి తీవ్ర తుపాను అంపన్.. తీరం దాటే సమయంలో బంగాల్​, ఒడిశాలను వణికించింది. భీకర గాలులు, కుండపోత వర్షాలతో విరుచుకుపడింది. తుపాను బీభత్సానికి ఇద్దరు మృతి చెందారు.

Cyclone Amphan
'అంపన్​ రాత్రి 7 గంటలకు దాటి వెళ్లిపోతుంది'

By

Published : May 20, 2020, 7:13 PM IST

అంపన్​ తుపాను దెబ్బకు ఒడిశా, బంగాల్​​ చిగురుటాకుల్లా వణికిపోయాయి. బలమైన ఈదురుగాలులకు భారీ వర్షం తోడవడగా తీర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. రోడ్లు, భవనాలు, చెట్లు దెబ్బతిన్నాయి. తుపాను ధాటికి బంగాల్​లో ఇద్దరు మృతి చెందారు.

తుపాను బంగ్లాదేశ్‌ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారనుందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వానికి సమాచారం అందించి సూచనలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

అప్రమత్తమైన బంగ్లా ప్రభుత్వం...

తుపాను ముంచుకొస్తున్న వేళ బంగ్లా ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సైన్యం సహాయంతో దాదాపు 20 లక్షల మందిని ప్రత్యేక కేంద్రాలకు తరలించింది. తీర ప్రాంతాల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇది ఆ దేశంలో 2007లో వచ్చిన సిధర్ తుపాను​ కన్నా అతి తీవ్రమైనదని అంచనా వేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details