బంగాల్లో విధ్వంసం సృష్టించిన అంపన్ తుపాను.. 2009లో వచ్చిన ఐలా తుపాను కంటే అత్యంత ప్రమాదకరమైనదని ఐక్యరాజ్యసమితి తెలిపింది. దశాబ్దం క్రితం ఐలా కారణంగా కోల్కతా సహా బంగ్లాదేశ్ అతలాకుతలమయ్యాయి. ఇప్పుడు అంపన్ అంతకు మించిన నష్టాన్ని కలగజేసిందని పేర్కొంది ఐరాస.
'ఐలా తుపాను కంటే అంపన్ బీభత్సమే ఎక్కువ' - kolkatha cyclone effect
పదేళ్ల క్రితం కోల్కతాలో బీభత్సం సృష్టించిన ఐలా తుపాను కంటే అంపన్ కలుగజేసిన నష్టం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది ఐక్యరాజ్య సమితి. అంపన్ విధ్వంసానికి బంగాల్లో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

'ఐలా తుపానుకు మించి ఆంపన్ బీభత్సం '
అంపన్ విలయతాండవానికి బంగాల్లో ఇప్పటి వరకు 80 మంది మృత్యువాత పడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు సహా 7 జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నాయి. వందలాది చెట్లు నేలకొరిగాయి. రోడ్లు బ్లాక్ అయ్యాయి. కోల్కతాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
తుపాను కారణంగా ప్రభావితమైన ప్రాంతాలను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. విహంగ వీక్షణం ద్వారా పరిస్థితులను పరిశీలించనున్నారు.