తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంపన్​ పంజా: తీర ప్రాంతాల్లో అల్లకల్లోలం​ - amphan cyclone

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అంపన్​ తుపాను తీరంపైపు పరుగులుపెడుతోంది. దీంతో ఒడిశా, బంగాల్ రాష్ట్రాల్లో ఈదురుగాలులు విస్తృతంగా వీస్తున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.

Cyclone Amphan: Heavy downpour, high velocity winds pound Odisha
రెండ రాష్ట్రాలను వణికిస్తోన్న.. అంపన్ తుపాన్​!

By

Published : May 20, 2020, 1:34 PM IST

రెండ రాష్ట్రాలను వణికిస్తోన్న అంపన్ తుఫాన్

అంపన్ తుపాను బంగాల్​, ఒడిశా రాష్ట్రాలను వణికిస్తోంది. దిఘా, హతియాల ద్వీపాల మధ్య బంగాల్​ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ రోజు సాయంత్రానికి బంగాల్​లోని సుందర్బన్​ వద్ద గంటకు 155-165 కి.మీ వేగంతో తీరం దాటనుంది.

తుపాను విజృంభణతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పూరి గుడిసెలు కొట్టుకుపోతున్నాయి. వందలాది చెట్లు రోడ్లపై కుప్పకూలిపోతున్నాయి. విద్యుత్​ స్తంభాలు విరిగిపడుతున్నాయి.

అప్రమత్తం..

వాతవారణ శాఖ ఆరెంజ్​ హెచ్చరికతో అప్రమత్తమైన బంగాల్​ ప్రభుత్వం..​ తీర ప్రాంతాల్లోని 3 లక్షలమందిని సురక్షిత కేంద్రాలకు తరలించింది. మార్కెట్లు, ఇతర వ్యాపార కేంద్రాలను మూసివేసింది. ప్రత్యేక రైళ్లనూ రద్దు చేసింది. అంపన్​ తుపాను కారణంగా​ హావ్​డా నుంచి దిల్లీకి వెళ్లాల్సిన ఏసీ స్పెషల్​ ఎక్స్​ప్రెస్​ రైలును రద్దు చేసినట్లు తెలిపింది తూర్పు రైల్వే.

తుపాను తీరం దాటే సమయంలో జరిగే విధ్వంసాన్ని ఎదుర్కొనేందుకు ఒడిశా ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 13 జిల్లాల్లోని 1,19,075మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. 1,704 పునరావాస కేంద్రాల్లో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరాన్ని అమలు చేస్తున్నారు.

సహాయక దళాలు రెడీ

విపత్తు నుంచి ప్రజలను రక్షించేందుకు భారత నావికా దళం నుంచి డైవింగ్​ బృందాలు బంగాల్​కు చేరుకున్నాయి. విశాఖపట్నం నుంచి వచ్చిన ఈ బృందాలు అధునాతన పరికరాలతో సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:ఇంటికెళ్లాలన్న ఆశ సరే... జాగ్రత్తలేవి?

ABOUT THE AUTHOR

...view details