తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుపానుగా మారిన వాయుగుండం-'ఆంఫాన్‌'గా నామకరణం - ఒడిశా అప్రమత్తం

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి ఆంఫాన్​గా పేరు పెట్టింది. ఈ నెల 18 నుంచి 20 తేదీల్లో బంగాల్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించింది.

Cyclone Amphan
ఆంఫాన్‌

By

Published : May 17, 2020, 12:10 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. దీనికి వాతావరణ శాఖ 'ఆంఫాన్‌'గా నామకరణం చేసింది. ప్రస్తుతం అంఫాన్‌ తుపాను ఒడిశాలోని పారాదీప్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ గుర్తించింది. గంటకు కిలోమీటరు వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతున్నట్లు తెలిపింది.

ఈ నెల 18 నుంచి 20 తేదీల్లో పశ్చిమ బెంగాల్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తుపాను కారణంగా ఈ నెల 18 నుంచి ఒడిశాలోని తీరప్రాంతాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తూర్పు తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. రేపటి నుంచి గాలుల ఉద్ధృతి పెరగనుందని చెప్పింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

ఒడిశా అప్రమత్తం

తుపాను ప్రభావం నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడే విధంగా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్. 12 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తీవ్రమైన ప్రభావం పడే ప్రాంతాల్లో ఎన్​డీఆర్​ఎఫ్​, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలను మోహరించనున్నట్లు తెలిపారు.

649 తీర ప్రాంత గ్రామాల్లోని 7 లక్షల మందిపై తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గ్రామాలు ఉన్న 12 జిల్లాలలో హైఅలర్ట్ ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details