రేపు సీడబ్ల్యూసీ భేటీ.. రాజీనామా యోచనలో రాహుల్ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో ఘోర పరాభవం చవిచూసింది. ఈ నేపథ్యంలో రేపు (శనివారం) దిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది. ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్చించనుంది.
ఇదే సమావేశంలో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఎన్నికల్లో ఓటమికి గల కారణాలు, వాటిని ఏవిధంగా అధిగమించి పార్టీని ముందుకు నడిపించాలనే అంశంపై సీనియర్ నేతలు చర్చించనున్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చేతిలో వరుసగా రెండోసారి ఓటమి పాలైంది కాంగ్రెస్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లకే పరిమితమైంది.
యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు పార్టీ ముఖ్య నేతలు సీడబ్ల్యూసీ భేటీకి హాజరుకానున్నారు.
ఇదీ చూడండి: భారత్ తీర్పు: పనిచేయని ప్రియాంక మ్యాజిక్