నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం దిల్లీలో జరగనుంది. పార్టీకి సబంధించి అత్యున్నత నిర్ణయాధికారం సీడబ్ల్యూసీ తీసుకుంటుంది.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో పార్టీ అనుసరించే వ్యూహాలపై చర్చించనున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల తేదీ ప్రకటన వంటి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది.