తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ పునర్విభజన రాజ్యాంగ విరుద్ధం: సీడబ్ల్యూసీ

జమ్ముకశ్మీర్‌ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని కాంగ్రెస్​ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ మంగళవారం రాత్రి సమావేశమైంది. కశ్మీర్ అంశంలో పార్లమెంటరీ విధానాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం  అతిక్రమించిందని ఆరోపించింది.

By

Published : Aug 7, 2019, 6:42 AM IST

Updated : Aug 7, 2019, 9:49 AM IST

కశ్మీర్​ పునర్విభజన రాాజ్యాంగ విరుద్ధం: సీడబ్ల్యూసీ

ఆర్టికల్ 370 రద్దు ఏకపక్ష, ప్రజాస్వామ్య విరుద్ధ నిర్ణయమని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) విమర్శించింది. కశ్మీర్​ను విభజిస్తూ, అధికరణలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై మంగళవారం రాత్రి సీడబ్ల్యూసీ సమావేశమైంది. ఏఐసీసీ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీ సహా పార్టీ నేత రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ప్రియాంక గాంధీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

కశ్మీర్​ పునర్విభజన రాాజ్యాంగ విరుద్ధం: సీడబ్ల్యూసీ

భాజపా భారత రాజ్యాంగాన్ని, జమ్ముకశ్మీర్‌ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపించింది కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ. పార్లమెంటరీ విధానాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అతిక్రమించిందని విమర్శించింది. జమ్ముకశ్మీర్‌ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని తప్పుపట్టింది.

Last Updated : Aug 7, 2019, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details