తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్యాంకు మోసాలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు - కమిషన్​

బ్యాంకు మోసాలపై దర్యాప్తునకు నిపుణులతో కూడిన నలుగురు సభ్యుల సలహా మండలిని ఏర్పాటు చేసింది కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ). బ్యాంకుల్లో రూ.50 కోట్లకు పైబడిన మోసాలపై ఈ మండలి దర్యాప్తు చేస్తుంది.

బ్యాంకు మోసాలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు

By

Published : Aug 26, 2019, 5:15 AM IST

Updated : Sep 28, 2019, 7:01 AM IST

బ్యాంకుల్లో జరుగుతోన్న మోసాలపై కేంద్ర నిఘా కమిషన్​ (సీవీసీ) దృష్టి సారించింది. రూ.50 కోట్లకు పైబడిన బ్యాంకు మోసాలపై దర్యాప్తు సహా చర్యలను సిఫార్సు చేసేందుకు నిపుణులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ సీవీసీ నిర్ణయం తీసుకుంది.

అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ (ఏబీబీఎఫ్)​ పేరిట నలుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ ప్యానెల్‌కు విజిలెన్స్ మాజీ కమిషనర్ టీఎమ్​ భాసిన్ నేతృత్వం వహించనున్నారు. ఆర్బీఐతో సంప్రదింపుల అనంతరం ఏబీబీఎఫ్​ను సీవీసీ ఏర్పాటుచేసింది.

బోర్డు ఛైర్మన్, సభ్యుల పదవీకాలం రెండేళ్లుగా నిర్ణయించారు. బ్యాంకుల్లో జరిగే భారీస్థాయి కుంభకోణాలపై దర్యాప్తు సంస్థల కంటే ముందే ఏబీబీఎఫ్​ ప్రాథమిక విచారణ చేపట్టనుంది. పీఎస్‌బీలకు సంబంధించిన కేసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినపుడు సీబీఐ కూడా ఏబీబీఎఫ్​కు సిఫార్సు చేయవచ్చు.

ఏబీబీఎఫ్​ సిఫార్సుల మేరకు బ్యాంకు మోసాలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకెళ్లవచ్చని పేర్కొంది సీవీసీ. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో జరిగే మోసాలను ఎప్పుటికప్పుడు విశ్లేషిస్తూ ఆర్బీఐకు సమాచారమందించేందుకు ఏబీబీఎఫ్​ తోడ్పడుతుందని పేర్కొంది.

Last Updated : Sep 28, 2019, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details