తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అనుమతులు లేమితో విచారణలో జాప్యం' - కేంద్ర ప్రభుత్వం

అవినీతి ఆరోపణలున్న ఉద్యోగులను విచారించేందుకు కేంద్ర విజిలెన్స్ కమిషన్​ ఎదురు చూస్తోంది. 41 కేసుల్లో 79 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే నాలుగు నెలలు దాటినా ఆయా ప్రభుత్వ విభాగాలు విచారణకు అనుమతులివ్వలేదని సీవీసీ పేర్కొంది.

అనుమతులతోనే జాప్యం

By

Published : Apr 16, 2019, 5:42 AM IST

Updated : Apr 16, 2019, 8:45 AM IST

అనుమతులతోనే జాప్యం

79 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు రాకపోవటం వల్ల విచారణ ఆలస్యమవుతోందని కేంద్ర విజిలెన్స్​ కమిషన్​ తెలిపింది.

"ఈ కేసుల విచారణ అనుమతులు నాలుగు నెలలుగా పెండింగ్​లో ఉన్నాయి. దీనిపై త్వరగా స్పందించాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలు, బ్యాంకు​ అధికారులను కోరుతూనే ఉన్నాం."
-సీవీసీ అధికారి

మొత్తంగా 41 కేసుల్లో వీరందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇందులో నాలుగు విభాగాలకు చెందిన ఉద్యోగులతో పాటు ఓ ఐఏఎస్ అధికారి ఉన్నారు. 13 మంది బ్యాంక్​ ఉద్యోగులు కూడా ఉన్నారు.

నిబంధనల ప్రకారం ఇటువంటి కేసుల్లో విచారణ అనుమతులు నాలుగు నెలల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి: ఆజంఖాన్​, మేనకా గాంధీపైనా ఈసీ నిషేధం...

Last Updated : Apr 16, 2019, 8:45 AM IST

ABOUT THE AUTHOR

...view details