దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి స్వతంత్ర వేడుకలు ఏ విధంగా ఉంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనాను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇప్పటికే ప్రణాళికలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వేడుకల్లో భారీ మార్పులు జరగనున్నట్టు సమాచారం.
మార్పులు ఇలా!
- వీవీఐపీలు, ఇతర ఔత్సాహికుల్లో కేవలం 20మందికే అనుమతి.
- చిన్నారులకు, ఎన్సీసీ సభ్యులకు అనుమతి లేదు.
- ప్రధాని ప్రసంగించే వేదిక సమీపంలో వీవీఐపీలు కూర్చునేందుకు వీలు లేదు. కొంచెం దిగువన కూర్చోవాలి. అది కూడా ఒకప్పటిలా 900మంది కాకుండా.. 100మందికి మాత్రమే అనుమతి.
వీటితో పాటు కరోనాను జయించిన 1500మందిని ఈ వేడుకలకు ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఇందులో 1,000మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు కాగా.. 500మంది స్థానిక పోలీసులు ఉండే అవకాశముంది.