తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​లో వైరస్ కేసుల రెట్టింపునకు 11 రోజులు'

కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలపై రోజువారీ నివేదిక విడుదల చేసింది కేంద్రం. వైరస్​ సోకినవారిలో 25.19 శాతం మందికి వైరస్ నయమైనట్లు స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం కరోనా నిర్ధరణ కోసం ఆర్​టీపీ-సీఆర్​ టెస్టు కిట్లను మాత్రమే వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.

virus
'భారత్​లో వైరస్ కేసుల రెట్టింపునకు 11 రోజుల సమయం'

By

Published : Apr 30, 2020, 5:32 PM IST

కరోనా నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలపై ప్రకటన విడుదల చేసింది కేంద్రం. భారత్​లో కేసులు రెట్టింపయ్యేందుకు 11 రోజుల సమయం పడుతున్నట్లు స్పష్టం చేసింది. లాక్​డౌన్ విధింపునకు ముందు ఇది 3.4 రోజులుగా ఉందని గుర్తు చేసింది. దేశంలో ప్రస్తుతం ఆర్​టీపీ-సీఆర్ టెస్టునే వైరస్ నిర్ధరణకు ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. భారత్​లో వ్యాధి నయమయ్యే రేటు 25.19 శాతంగా ఉందని వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. 14 రోజుల క్రితం ఇది 13.06గా ఉన్నట్లు స్పష్టం చేసింది.

రాష్ట్రాల వారిగా రెట్టింపునకు సమయం..

ఉత్తర్​ప్రదేశ్​, జమ్ముకశ్మీర్, ఒడిశా, పంజాబ్​ల్లో కేసులు రెట్టింపయ్యేందుకు 11 రోజులు పడుతోందని సమాచారం. కేరళ, లేహ్​, కర్ణాటక, ఉత్తరాఖండ్​ల్లో కేసులు రెట్టింపయ్యేందుకు 20 రోజులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పురుషులే అధికం..

ఆరోగ్య శాఖ ప్రకటన ప్రకారం మరణాల రేటు ప్రస్తుతం 3.2గా ఉంది. మృతుల్లో 65 శాతం మంది పురుషులు. 35 శాతం మహిళలు ఉన్నారు.

చిక్కుకుపోయిన వారికోసం ప్రత్యేక రైళ్లు..!

వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, వలస కార్మికులు వంటి వారికోసం ప్రత్యేక రైళ్లను నడపాలని పలు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాాయని సమాచారం. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని.. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై యోచిస్తున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:'సమయాన్ని తగ్గించి జులైలో పరీక్షలు నిర్వహించండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details