కర్ణాటక చిత్రదుర్గ ప్రాంతంలోని ఓ వ్యవసాయ భూమిలో రూ.36 లక్షల విలువైన నగదు బయటపడింది. ఈ డబ్బు 'దిలీప్ బిల్డ్ ఖాన్' అనే జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ నుంచి దొంగలించిన సొమ్మేనని పోలీసులు గుర్తించారు. డబ్బులు బయటపడిన ప్రాంతం ఈ కంపెనీకి సమీపంలోనే ఉంది.
వ్యవసాయ భూమిలో లక్షలు దొరికాయ్.. - karnataka chitradurga farm money
కర్ణాటక, చిత్రదుర్గ జిల్లాలోని ఓ వ్యవసాయ భూమిలో రూ. 36 లక్షల నగదు ప్రత్యక్షమైంది. రహదారులను నిర్మించే ఓ ప్రైవేటు సంస్థ నుంచి చోరీకి గురైన సొమ్ము ఇదేనని పోలీసులు భావిస్తున్నారు.
వ్యవసాయ భూమిలో రూ.36 లక్షల నగదు
జిల్లాలోని చల్లకెరే తాలుకా, బక్లూరహళ్లిలో ఉన్న సంస్థ తాత్కాలిక కార్యాలయం నుంచి మూడు రోజుల క్రితం నగదు చోరీకి గురైందని పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనుల కోసం ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయం సమీపంలోనే డబ్బును గుర్తించిన పోలీసులు.. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు.
ఇదీ చదవండి-కారాగారాలు దిద్దుబాటలో నడిస్తే సంస్కరణలకు నిలయాలే