తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోంలో నిషేధాజ్ఞల సడలింపు.. బయటికొస్తున్న జనం - అసోం

పౌర చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లతో అసోంలోని గువాహటి సహా దిబ్రూగఢ్​లోని పలు ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూను సడలించారు అధికారులు. నిత్యావసరాల కోసం కిరాణా దుకాణాల వద్ద జనం బారులు తీరారు. అసోం పౌరుల హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద​ సోనోవాల్​ హామీ ఇచ్చారు.

Curfew relaxed in Guwahati
అసోంలో నిషేధాజ్ఞల సడలింపు

By

Published : Dec 15, 2019, 10:19 AM IST

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేక అల్లర్లతో అట్టుడికిన అసోంలో నిషేధాజ్ఞలు సడలించారు అధికారులు. గువాహటి సహా దిబ్రూగఢ్​లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేశారు.

గువాహటిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. దిబ్రూగఢ్​లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని.. అంతర్జాల సేవలంపై ఉన్న నిషేధాన్ని రేపటి వరకూ కొనసాగించనున్నట్లు అడిషనల్​ డీడీ జీపీ సింగ్​ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వదంతుల వ్యాప్తిని నిరోధించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

నిత్యవసరాల కోసం బారులు..

కర్ఫ్యూ సడలించిన నేపథ్యంలో నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకు కిరాణ దుకాణాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గువాహటిలోని దిస్పుర్​, ఉజాన్ బజార్​, చంద్మరి, సిల్పఖురి, జూరోడ్​లోని దుకాణాల వద్ద వందల మీటర్ల మేర క్యూలైన్లలో జనం వేచి ఉన్నారు. నగరంలోని పెట్రోల్​ బంకుల వద్ద వాహనదారులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు.

హక్కుల రక్షణకు కట్టుబడి ఉన్నాం..

నిజమైన భారతీయులు, అసోం పౌరుల హక్కులను రక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద​ సోనోవాల్​. పౌరసత్వ చట్ట సవరణపై తప్పదోవ పట్టించే వారిని, హింసను ప్రేరేపించే వారిని తరిమికొట్టాలని సూచిస్తూ ట్వీట్​ చేశారు.

శర్బానంద్​ సోనోవాల్ ట్వీట్​

ఇదీ చూడండి: అపస్మారక స్థితిలోకి స్వాతి మాలివాల్​.. ఆస్పత్రికి తరలింపు

ABOUT THE AUTHOR

...view details