కరోనా రోగుల చికిత్సలో యాంటీ వైరల్ ఔషధం యుమిఫెనొవిర్ క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్ర ఔషధ పరిశోధనా సంస్థ(సీడీఆర్ఐ) అనుమతినిచ్చింది. లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ వైద్య విశ్వవిద్యాలయం సహా.. మరికొన్ని ఆస్పత్రుల్లో దీనిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభంకానున్నాయి.
చైనా, రష్యాలో అలా..
యువిఫెనొవిర్ ఔషధం.. మానవ కణాల్లో వైరస్ ప్రవేశించకుండా నివారించడం సహా రోగ నిరోధక శక్తినీ పెంచుతుంది. చైనా, రష్యాలో లభ్యమయ్యే ఈ ఔషధాన్ని ప్రస్తుతం శీతల జ్వరానికి ఉపయోగిస్తున్నారు. కరోనా రోగులకు కూడా ఇది మెరుగైన ఫలితాలు ఇస్తుండటం వల్ల దీనికి మరింత ప్రాముఖ్యం పెరిగింది. భారత్‌లోని కరోనా రోగులపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకునేందుకు సీఎస్ఐర్- సీడీఆర్ఐ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాయి.
ఇదీ చదవండి:ఆ నీటిని తాగండి.. కరోనాను తరిమికొట్టండి!