ముగిసిన సైనిక అధికారుల సమావేశం..
చైనా వైపున్న చుశూల్ మాల్డో వద్ద జరిగిన ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్‌ల సమావేశం ముగిసింది. లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం లేహ్‌కు తిరిగి వచ్చింది.
17:16 June 06
ముగిసిన సైనిక అధికారుల సమావేశం..
చైనా వైపున్న చుశూల్ మాల్డో వద్ద జరిగిన ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్‌ల సమావేశం ముగిసింది. లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం లేహ్‌కు తిరిగి వచ్చింది.
15:33 June 06
కొనసాగుతున్న సమావేశం
సరిహద్దు వివాదంపై భారత్, చైనా జనరల్‌ల మధ్య తూర్పు లద్దాఖ్‌లోని చుశూల్ ప్రాంతంలోని మాల్డో వద్ద సమావేశం కొనసాగుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో లెఫ్టినెంట్ జనరల్‌ల స్థాయిలో ఈ చర్చలు జరుగుతున్నాయి.
భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్, చైనా ప్రతినిధిగా టిబెట్ మిలిటరీ కమాండర్ హాజరయ్యారు. మే 5, 6 తేదీల్లో సరిహద్దుల వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. లద్దాఖ్‌లోని పాంగాంగ్ సో, గాల్వన్ లోయ, దెమ్‌చోక్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశం వేదికగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు నిర్దిష్ట ప్రతిపాదనలు చేయనుంది భారత్. పాంగాంగ్ సో, గాల్వన్ లోయ నుంచి చైనా బలాలు వెనుదిరగాలని వాదన వినిపిస్తోంది. చైనా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను తొలగించాలని డిమాండ్ చేస్తోంది.
13:51 June 06
ఉన్నతస్థాయి చర్చ ప్రారంభం..
తూర్పు లద్ధాఖ్‌లో నెల రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించే దిశగా భారత్, చైనా లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు మాల్దోలో కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
11:57 June 06
సైనిక, దౌత్య మార్గాల ద్వారానే..
భారత్, చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల అంశంపై సైనిక, దౌత్య మార్గాల ద్వారానే చర్చలు కొనసాగించాలని ఇరువర్గాల ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
11:50 June 06
11.30 గంటలకు ప్రారంభం అవుతుందని భావించిన భారత్-చైనా అధికారుల భేటీ ఇంకా మొదలుకాలేదు.
10:51 June 06
భారత్-చైనా అధికారుల భేటీ 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం చర్చలు 11 నుంచి 11.30 గంటల మధ్య మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
10:04 June 06
భేటీ ఎక్కడంటే..
తూర్పు లద్ధాఖ్లోని చుశూల్ సమీపంలోని మాల్డోలో ఈ భేటీ జరగనుంది. భారత్ తరఫు బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్ జనరల్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహిస్నున్నారు. టిబెట్ మిలిటరీ కమాండర్ చైనా తరఫున నాయకత్వం వహిస్తున్నారు.
భేటీలో చర్చించే అంశాలు!
ఈ సమావేశంలో భారత్ కీలకమైన అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్యాంగాంగ్ సో, గాల్వన్ లోయలో పూర్వస్థితికి వచ్చేలా చైనా వెనుదిరగాలని నొక్కి చెప్పే అవకాశం ఉంది. ఇరువర్గాల మధ్య మే 5న జరిగిన ఘర్షణల తర్వాత చైనా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ క్యాంపులను తొలగించాలని సూచించనుంది.
2018 ఏప్రిల్‌లో వుహాన్‌లో జరిగిన తొలి అనధికారిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేయాలని భారత్ పట్టుబడుతుందని సైనిక వర్గాలు తెలిపాయి. 2017లో డోక్లాం పరిణామాల తర్వాత రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలకు సంబంధించి దౌత్య చర్చలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వుహాన్ భేటీ జరిగింది.
09:40 June 06
భారత్-చైనా చర్చలు
సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనా సైన్యాల మధ్య లెఫ్టినెంట్ జనరల్ స్థాయి చర్చలు కాసేపట్లో ప్రారంభంకానున్నాయి. తూర్పు లద్ధాఖ్‌లో నెల రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించే దిశగా ఈ భేటీతో రెండు దేశాలు తొలి అడుగు వేయనున్నాయి.