తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'గాంధీ'ల భద్రత కోసం కొత్తగా వెయ్యి మంది జవాన్లు!

సోనియాగాంధీ, రాహుల్​, ప్రియాంకల భద్రత ప్రోటోకాల్స్​ను వివరిస్తూ సీఆర్​పీఎఫ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. గాంధీలతోపాటు, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ దంపతుల భద్రత కోసం కనీసం ఒక బెటాలియన్​​ను అయినా పెంచడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రహోంశాఖను కోరింది.

'గాంధీ'ల భద్రత కోసం కొత్తగా వెయ్యి మంది జవాన్లు!

By

Published : Nov 19, 2019, 8:22 PM IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబ సభ్యుల భద్రత కోసం అనుసరించాల్సిన కొత్త విధానాలపై సీఆర్​పీఎఫ్...​ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. గాంధీల భద్రత కోసం కనీసం ఒక బెటాలియన్​ను అయినా పెంచడానికి చర్యలు తీసుకోవాలని హోంశాఖను కోరింది.

ఎస్​పీజీ భద్రత తొలగింపు..

సోనియాగాంధీ, రాహుల్​గాంధీ, ప్రియాంక గాంధీలకు కల్పిస్తున్న ఎస్​పీజీ భద్రతను ఇటీవలే కేంద్రప్రభుత్వం తొలగించింది. మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్​ సహా 'గాంధీ' కుటుంబ సభ్యులకు సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్​ (సీఆర్​పీఎఫ్​) ద్వారా 'జెడ్​ ప్లస్​' భద్రత కల్పించాలని నిర్ణయించింది.

24 గంటల ముందే..

గాంధీ కుటుంబ సభ్యులు, మన్మోహన్ సింగ్​ దంపతుల భద్రత కోసం సీఆర్​పీఎఫ్​ ఇప్పటికే 700 మంది సిబ్బందిని కేటాయించింది. ఈ ఐదుగురి పర్యటనల సమయంలో ప్రత్యేక సీఆర్​పీఎఫ్​ బృందాలు.. సంబంధిత ప్రదేశాలకు కనీసం 24 గంటల ముందే చేరుకుంటాయి. స్థానిక అధికారులతో సంప్రదించి వేదికను, వీవీఐపీల సందర్శించే ప్రదేశాల్లో భద్రత తనిఖీలు చేస్తాయి.

అదనపు బలగాలు అవసరం...

సీఆర్​పీఎఫ్​లో ప్రస్తుతం 3 లక్షల మందికిపైగా సిబ్బంది ఉన్నారు. 57 మంది అత్యంత ప్రముఖుల భద్రతను ఆ దళం పర్యవేక్షిస్తోంది. ప్రముఖుల జాబితా పెరుగుతున్నందున కనీసం 1-2 బెటాలియన్లు (1000-2000 మంది సిబ్బంది) అదనంగా తీసుకోవాలని భావిస్తోంది.

ప్రముఖుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సాయుధ వాహనాలను కూడా సేకరించడానికి సీఆర్​పీఎఫ్ ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కాలుష్యంపై లోక్​సభలో చర్చ- ఆప్​ సర్కారుపై విమర్శలు

ABOUT THE AUTHOR

...view details