తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీనగర్​లో ఎన్​కౌంటర్- హురియత్​ ఛైర్మన్​ కుమారుడు హతం - jk latest encounter news

జమ్ముకశ్మీర్ శ్రీనగర్​ సమీపంలో భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. చనిపోయిన ఉగ్రవాదుల్లో హురియత్​ ఛైర్మన్​ కుమారుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్​లో ఓ పోలీస్ అధికారి, ఓ జవానుకు గాయాలయ్యాయి.

encounter with militants in Srinagar
శ్రీనగర్​లో ఎన్​కౌంటర్.. ఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు

By

Published : May 19, 2020, 12:29 PM IST

Updated : May 19, 2020, 3:17 PM IST

జమ్ముకశ్మీర్​ శ్రనగర్​లో నవాక్​దల్​ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్​లో ఓ సీఆర్​ఫీఎఫ్​ జవాను, ఓ పోలీస్​కు గాయాలైనట్లు అధికారులు తెలిపారు.

ఎన్​కౌంటర్​లో చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు హురియత్​ ఛైర్మన్​ అష్రఫ్​ షెహ్రాయి కుమారుడు జునైద్​ షెహ్రాయి అని అధికారులు తెలిపారు.

నవాక్​దల్​ ప్రాంతంలో ముష్కురులున్నారన్న పక్కా సమాచారంతో అక్కడ నిర్బంధ తనిఖీలు నిర్వహించారు భద్రతా సిబ్బంది. వీరిని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఫలితంగా ఎన్​కౌంటర్​కు దారి తీసింది.

ఉదయం 2 గంటల సమయంలో ఎన్​కౌంటర్​ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో మొబెైల్ ఇంటర్నెట్​ సేవలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు.

Last Updated : May 19, 2020, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details