తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో మావోల దాడి.. జవాను మృతి - Naxals

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు ఐఈడీ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ సీఆర్పీఎఫ్​ జవాను ప్రాణాలు కోల్పోయారు.

ఛత్తీస్​గఢ్​లో మావోల దాడి

By

Published : Jul 31, 2019, 10:17 AM IST

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. బస్తర్​ జిల్లా పుస్పర్​ గ్రామ సమీపంలో ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. నక్సల్స్​ దుశ్చర్యకు సీఆర్పీఎఫ్​ జవాను రౌషన్​ కుమార్​ (23) ప్రాణాలు కోల్పోయారు. రౌషన్​ బిహార్​లోని​ నలందా జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం సీఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నారు.

సీఆర్పీఎఫ్​ 195వ బెటాలియన్​ క్యాంపు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి : కాఫీడే సిద్ధార్థ మృతి- నది ఒడ్డున మృతదేహం

ABOUT THE AUTHOR

...view details