జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఓ సీఆర్పీఎఫ్ జవాను మానవత్వాన్ని చాటుకున్నాడు. సైనికులు శత్రువుల గుండెల్లో తూటాలు దింపటమే కాదు.. ఆకలిగా ఉన్నవారిని అక్కున చేర్చుకుంటారని నిరూపించాడు హవల్దార్ ఇక్బాల్ సింగ్.
చిన్నారి ఆకలి కన్నీరు చూసి...
శ్రీనగర్‌లో సోమవారం విధులు నిర్వర్తిస్తుండగా ఆకలితో ఉన్న ఓ చిన్నారిని చూశాడు ఇక్బాల్. వెంటనే తన భోజనాన్ని బాలుడికి ఇవ్వడానికి ప్రయత్నించాడు. పక్షవాత బాధితుడైన చిన్నారి సొంతంగా తినలేని పరిస్థితిని గ్రహించిన ఇక్బాల్... క్షణం ఆలస్యం చేయకుండా స్వయంగా భోజనం తినిపించాడు. మంచినీరు అందించి... చిన్నారి ఆకలిని తీర్చాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జవాను చేసిన పనికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.