తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరల్​: పోలీసులను హడలెత్తించిన మొసలి - news on Crocodile enter into the police station

వర్షాల కారణంగా నివాస ప్రాంతాల్లోకి మొసళ్లు చేరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వార్తలు తరచూ చూస్తూనే ఉన్నాం. అలాంటి అనుభవమే ఉత్తర్​ప్రదేశ్​ లకిమ్​పుర్​ ఖేరీ పోలీసులకు ఎదురైంది.

పోలీసులను హడలెత్తించిన మొసలి

By

Published : Oct 20, 2019, 11:44 AM IST

పోలీసులను హడలెత్తించిన మొసలి
ఉత్తర్​ప్రదేశ్​ లకిమ్​పుర్​ ఖేరీలో ఓ మొసలి హల్​చల్​ సృష్టించింది. నగరంలోని పోలీస్​ స్టేషన్​లోకి చొరబడింది. ఠాణాలో ఉన్న 12 మంది సిబ్బందిని హడలెత్తించింది. నాలుగు అడుగుల పొడవైన మొసలిని చూసి వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. స్టేషన్​ ప్రాంగణంలో తిరుగుతున్న దానికి ఎలాంటి హాని తలపెట్టకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సంఘటన గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగింది.

సమాచారం అందుకున్న దుధ్వా భపర్​ జోన్​ అటవీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మొసలిని పట్టుకుని, అడవిలో వదిలిపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details