తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విదేశీ బృందం పర్యటనపై ఆరోపణలు నిరాధారం' - విదేశాంగ మంత్రిత్వ శాఖ వార్తలు

కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించడానికి విదేశీ ప్రతినిధుల బృందం అక్కడ పర్యటిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. పర్యటనలో భాగంగా కశ్మీర్​లోని రాజకీయ నేతలు, పౌరులు, మీడియాతో ప్రతినిధులు మాట్లాడినట్లు తెలిపింది. 'గైడెడ్​ టూర్'​ అంటూ వస్తున్న విమర్శలను ఖండించింది.

Criticism of envoys visit to J&K unfounded: MEA
రవీశ్ కుమార్, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి

By

Published : Jan 9, 2020, 7:35 PM IST

జమ్ము కశ్మీర్​లో పరిస్థితులు సాధారణ స్థాయికి తెచ్చేందుకు చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను పరిశీలించేందుకే విదేశీ ప్రతినిధుల బృందం ఆ ప్రాంతంలో పర్యటిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పష్టం చేశారు. 'గైడెడ్ టూర్'​ అంటూ విపక్షాలు చేసిన విమర్శలను తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమైన, అసత్య ప్రచారాలని తిప్పికొట్టారు. ఐరోపా ప్రతినిధులతో కలిసి భవిష్యత్తులో కశ్మీర్ పర్యటన నిర్వహిస్తామని వెల్లడించారు.

రవీశ్ కుమార్, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి

"కశ్మీర్​లో పరిస్థితులు సాధారణ స్థితికి తేవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించడం సహా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంతంలో నెలకొన్న సాధారణ పరిస్థితులను గమనించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం."
-రవీశ్ కుమార్, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి

పర్యటనలో భాగంగా ప్రతినిధులు కశ్మీర్​లోని పౌరులు, రాజకీయ నాయకులు, భద్రత అధికారులతో పాటు మీడియాను కలిసినట్లు రవీశ్ వెల్లడించారు. భద్రత పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఈ పర్యటన ఖరారు చేసినట్లు తెలిపారు.

15 మంది విదేశీ ప్రతినిధులు ప్రస్తుతం కశ్మీర్​లో పర్యటిస్తున్నారు. భారత్​లోని అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ సైతం రెండు రోజుల పర్యటన నిమిత్తం జమ్ము కశ్మీర్​కు చేరుకున్నారు. జమ్ము కశ్మీర్​కు ప్రత్యేక హోదా తొలగించిన తర్వాత ఓ విదేశీ దౌత్యవేత్త రాష్ట్రాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.

ఇరాన్​ ఉద్రిక్తతలపై స్పందన

పశ్చిమాసియాలో వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాలని కోరుకుంటున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. గల్ఫ్​ ప్రాంతంలో పరిస్థితులను భారత్ సునిశితంగా పరిశీలిస్తోందని రవీశ్ కుమార్ స్పష్టం చేశారు. తాజా పరిస్థితులపై ఆ ప్రాంతంలోని కొన్ని దేశాలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details