తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయొచ్చా? ఈసీకి సుప్రీం ఆదేశాలు - election commission latest news

ఎన్నికల్లో నేరస్థులు పోటీ చేయకుండా నిషేధం విధించాలనే పిటిషన్​పై ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయొచ్చా? ఈసీకి సుప్రీం అదేశాలు

By

Published : Nov 25, 2019, 11:00 PM IST

Updated : Nov 26, 2019, 2:38 AM IST

నేర రికార్డులు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హేతుబద్ధమైన ఉత్తర్వులు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

నేర రికార్డులు ఉన్న వ్యక్తులను రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలబెట్టకుండా సరికొత్త విధానం తీసుకొచ్చేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ భాజపా నేత, సీనియర్‌ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని తిరస్కరించిన చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ‘అశ్విని ఉపాధ్యాయ్‌ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని మూడు నెలల్లోగా హేతుబద్ధమైన ఉత్తర్వులు ఇవ్వాలని ఈసీని ఆదేశించాం’ అని పేర్కొంది.

పెరుగుతున్న నేరస్థుల సంఖ్య

రాజకీయాల్లో నేరారోపణలు ఉన్న వ్యక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని అశ్విని ఉపాధ్యాయ్‌ విచారం వ్యక్తం చేశారు. ఏడీఆర్ డేటా ప్రకారం పార్లమెంట్‌ సభ్యుల్లో 24శాతం మందిపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే నేర రికార్డులు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై ఈ ఏడాది జనవరిలో విచారణ జరిపిన న్యాయస్థానం.. పిటిషనర్‌ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని ఆదేశించింది. అయితే తన అభ్యర్థనపై ఈసీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని.. అందుకే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు అశ్విని ఉపాధ్యాయ్‌ తెలిపారు. దీంతో మూడు నెలల్లోగా ఉత్తర్వులు ఇవ్వాలని ఈసీని న్యాయస్థానం ఆదేశించింది.

ఇదీ చూడండి: ప్రజల్ని చంపేస్తారా? అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు

Last Updated : Nov 26, 2019, 2:38 AM IST

ABOUT THE AUTHOR

...view details