తెలంగాణ

telangana

By

Published : Nov 3, 2019, 9:31 PM IST

ETV Bharat / bharat

ఎమ్మెల్యేల మద్దతు కోసం నేరపూరిత చర్యలు: రౌత్​

శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్​రౌత్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు కోసం నూతన శాసనసభ్యులను బలవంతపెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అమిత్​ షా మౌనంగా ఉన్నారని అన్నారు. షా మౌనానికి కారణమేంటో అంతుచిక్కడం లేదని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేల మద్దతు కోసం నేరపూరిత చర్యలు: రౌత్​

నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులను బలవంతపెట్టి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కూడగట్టడానికి నేరపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్​ రౌత్. దీనితోపాటు ప్రభుత్వ సంస్థలను వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. త్వరలోనే ఈ విషయాలను బహిర్గతం చేస్తానని అన్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అమిత్​ షా మౌనంగా ఉన్నారని...ఆయన మౌనానికి కారణం ఏమిటో అంతుచిక్కడం లేదని పేర్కొన్నారు.

'ఇది ఆట కాదు. శివసేనకు ఇది నిజాయతీ, నమ్మకం, ఆత్మగౌరవంతో కూడిన అంశం. అమిత్​ షా సూటిగా వ్యవహరించే వ్యక్తి. తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అంగీకరిస్తారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంపై దృష్టి పెట్టడం లేదు.'-సంజయ్​ రౌత్, శివసేన రాజ్యసభ సభ్యుడు.

సంజయ్​ వ్యాఖ్యలపై భాజపా నేత గిరీష్​ మహాజన్​ స్పందించారు. ఎవరు ఎవరిపై ఒత్తిడి తీసుకొస్తున్నారో చెబితే బాగుంటుందని హితవు పలికారు. ఈ నెల​ 9 నాటికి మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్నందన.. ఈలోగా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details