తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2020, 7:19 AM IST

ETV Bharat / bharat

ఈ పిల్లల క్రియేటివిటీ సూపర్​ గురూ..!

చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ తూగుడు బల్ల మీద స్నేహితులతో ఆడే ఉంటారు. ఇరువైపులా ఇద్దరు కూర్చుని ఊగుతూ ఉంటారు. అయితే అలాంటి వసతి లేని కొందరు పిల్లలు వినూత్నంగా దాన్ని తయారుచేసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోను ఓ ఐఏఎస్​ అధికారి షేర్​ చేయగా.. నెట్టింట వైరల్​గా మారింది.

children Creative See-Saw
ఈ పిల్లల క్రియేటివిటీ సూపర్​ గురూ..!

మధ్యప్రదేశ్​లోని ఇద్దరు విద్యార్థులు తూగుడు బల్లపై ఊగుతున్న వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండు దుంగలను వినియోగించి దాన్ని తయారు చేశారు. ఒక దుంగ మీద వంపుగా ఉన్న కర్రను చేర్చి దాన్ని ఊగేలా మార్చారు. ఆ చిన్నారులు ఆడుకుంటున్న వీడియోను ఓ ఐఏఎస్​ అధికారి పోస్టు చేశారు. వారిద్దరూ అందుబాటులో ఉన్న వాటితోనే అవకాశాలు సృష్టించుకున్నారని ఆయన ప్రశంసించారు. ఆత్మ నిర్భర్​ భారత్​కు ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. దీన్ని మహారాష్ట్రలోని బందారా ప్రాంతంలో 'ఘన్​మక్​డీ'గా పిలుస్తారని ఓ నెటిజన్​ తెలిపాడు.

పిల్లల్లో సృజనాత్మకత, వారి ఆలోచనల పట్ల ఈ మధ్య కాలంలో బాగానే ప్రశంసలు వస్తున్నాయి. ఆనంద్​ మహీంద్రా కూడా ఇటీవలెే కొంతమంది చిన్నారులు మట్టితో క్యారమ్​బోర్డు చేసుకొని ఆడటాన్ని సోషల్​ మీడియా వేదికగా మెచ్చుకున్నారు.

ఇదీ చూడండి: 50 ఏళ్ల టీచరమ్మ.. బౌలింగ్​ అదిరిందమ్మా!

ABOUT THE AUTHOR

...view details