భారత్‌ను విపత్తు నిర్వహణలో ముందంజలో నిలబెట్టడమే లక్ష్యమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు గొలుసుకట్టు ఆదేశాల విధానాన్ని రూపొందించాలని సూచించారు. విపత్తు నిర్వహణలో రాష్ట్రాల సన్నద్ధతపై దిల్లీలో ఏర్పాటు చేసిన వార్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు.
హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రథమ బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు షా.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాల పనితీరును ప్రశంసించారు అమిత్‌షా. 12వేల మంది విపత్తు నిర్వహణ సిబ్బందికి ఆధునిక పరికరాలు అందజేయనున్నామని, మౌలిక వసతులను పెంచనున్నామని స్పష్టం చేశారు.