తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాసవాన్​... ఎన్​డీఏకి షాక్​, ఆర్​జేడీకి బ్రేక్​ ఇస్తారా? - BJP laterst news

బిహార్.. ఎన్నికల సమరానికి సమాయత్తమవుతోంది. నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని ఎన్​డీఏను ఎదుర్కొనేందుకు ఆర్​జేడీ ఢీ అంటే ఢీ అంటోంది. అయితే తాజాగా లాలూ పార్టీలో లుకలుకలు, రాజీనామాలు ప్రతిపక్షంలో గుబులు పుట్టిస్తుంటే.. మరోవైపు బలంగా ఉన్నామని బల్ల గుద్ది చెబుతున్న ఎన్​డీఏకి 'పాసవాన్'​ రూపంలో షాక్​ తగిలేలా ఉంది. అసలు ప్రస్తుతం బిహార్​ రాజకీయ ముఖచిత్రం ఏంటి?

Cracks within Bihar NDA
పాసవాన్​.. ఎన్​డీఏకు షాక్​, ఆర్​జేడీకి బ్రేక్​ ఇస్తారా?

By

Published : Jun 30, 2020, 5:30 PM IST

Updated : Jun 30, 2020, 6:41 PM IST

ఆన్​లైన్​ ప్రచార రథాలు, వర్చువల్​ ర్యాలీలు, వ్యూహప్రతివ్యూహాలు.. ఓ వైపు. కీలక నేతల రాజీనామాలు, కూటమిలో లుకలుకలు మరోవైపు.. ఇది ఎన్నికల ముందు బిహార్​లో పార్టీల పరిస్థితి.

పాసవాన్​.. ఎన్​డీఏకు షాక్​, ఆర్​జేడీకి బ్రేక్​ ఇస్తారా?

ఈ ఏడాది అక్టోబర్​- నవంబర్​ మధ్యలో బిహార్​ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. జనతాదళ్​ యునైటెడ్​ (జేడీయూ), భారతీయ జనతా పార్టీ (భాజపా), లోక్​ జనశక్తి పార్టీ (ఎల్​జేపీ)తో ఎన్​డీఏ పటిష్ఠంగా కనిపిస్తోంది.

ప్రతిపక్ష రాష్ట్రీయ జనతా దళ్​ (ఆర్​జేడీ).. పార్టీలో లుకలుకలు, కీలక నేతల రాజీనామాలతో ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతం పరిస్థితులు పైకి ఇలానే కనిపిస్తున్నా.. ఎన్​డీఏలోనూ తాజాగా ఓ గుబులు మొదలైంది.

సీట్ల పంపకంలో...

శాసనసభ ఎన్నికల సీట్ల పంపకంలో ఎన్​డీఏ ఇచ్చిన ఆఫర్​పై ఎల్​జేపీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. 33 సీట్లు కేటాయించేందుకు ఎన్​డీఏ సిద్ధమవగా... 43 సీట్ల కన్నా తక్కువ తీసుకునేది లేదని ఎల్​జేపీ అధ్యక్షుడు చిరాగ్​ పాసవాన్​ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.

వేగంగా పావులు కదిపిన ఆర్​జేడీ... మహాకూటమిలో చేరితే ఎల్​జేపీకి 52 సీట్లు కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

తెగదెంపులు...

ఎన్​డీఏలో జేడీయూకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై పాసవాన్​ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. డిమాండ్లను నేరవేర్చలేని పక్షంలో ఎన్​డీఏతో తెగదెంపులు చేసుకునేందుకు పాసవాన్​ వెనకాడేది లేదని సమాచారం.

బుజ్జగింపులు...

ఈ నేపథ్యంలో ఎల్​జేపీని బుజ్జగించేందుకు భాజపా బిహార్​ బాధ్యుడు భూపేంద్ర యాదవ్​ రంగంలోకి దిగారు. గత నాలుగు రోజుల్లో చిరాగ్​ పాసవాన్​తో రెండుసార్లు భేటీ అయ్యారు.

వేగంగా ఆర్​జేడీ...

ఎన్​డీఏలో జరుగుతోన్న కీలక పరిణామాలను ప్రతిపక్ష ఆర్​జేడీ నిశితంగా పరిశీలిస్తోంది. వేగంగా పావులు కదుపుతోంది. ఎల్​జేపీ.. మహాకూటమిలో చేరితే రానున్న ఎన్నికల్లో 52 సీట్లు కేటాయిస్తామని పాసవాన్​కు తేజస్వీ యాదవ్ ఆఫర్​ ఇచ్చినట్లు సమాచారం.

అయితే పాసవాన్​తో నేరుగా తేజస్వీ యాదవ్ మాట్లాడకపోయినా.. ఈ మేరకు సందేశం పంపారట.

​ఎన్​డీఏ సిద్ధంగా లేదు...

బిహార్​లో ఏకఛత్రాధిపత్యం చలాయించేంత లేకున్నా.. నిమ్నవర్గాల్లో ఎల్​జేపీకి మంచి పట్టు ఉంది. కనుక ఎల్​జేపీని వదులుకునేందుకు ఎన్​డీఏ సిద్ధంగా లేదు. అందుకే పలు దఫాల్లో పాసవాన్​తో చర్చలు జరపాలని భాజపా అధిష్ఠానం ఆదేశించిందట.

బిహార్​లో ప్రస్తుత పరిస్థితులపై 'ఈటీవీ భారత్'​కు​ ఇచ్చిన ముఖాముఖిలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్​ పలు విషయాలు వెల్లడించారు.

భూపేంద్ర యాదవ్​తో ముఖాముఖి

ఎలాంటి విభేదాలు లేవు...

ఎన్​డీఏలో ఎలాంటి విభేదాలు లేవని.. ఐకమత్యంగా ఉన్నామని భూపేంద్ర యాదవ్​ అన్నారు. ఎన్​డీఏ సీనియర్​ నేత, చిరాగ్​ పాసవాన్​ తండ్రి రాంవిలాస్​ పాసవాన్​ చెప్పినట్లే రాష్ట్రంలో ముందుకు వెళ్తామన్నారు.

గెలుపు మాదే...

భూపేంద్ర యాదవ్​తో ముఖాముఖి

రాష్ట్రంలో ఎన్​డీఏ బలంగా ఉందని... రాబోయే ఎన్నికల్లో మూడు నుంచి నాలుగు వంతుల మెజార్టీ సాధిస్తామని భూపేంద్ర ధీమా వ్యక్తం చేశారు.

Last Updated : Jun 30, 2020, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details