దేశంలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో తాజాగా 3,947 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,602కు చేరి... దేశంలోనే రెండో స్థానానికి చేరుకుంది. మరో 68 మంది మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 2301కు పెరిగింది.
మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతం
దేశంలోనే కరోనా కేసుల్లో తొలిస్థానంలో ఉంది మహారాష్ట్ర. మరణాలూ అధికంగానే నమోదవుతున్నాయి. తాజాగా 3,214 మందికి కరోనా సోకింది. మరో 248 మంది వైరస్‌తో మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 1,39,010కు చేరగా... మరణాల సంఖ్య 6531కు పెరిగింది.
శివసేన పార్టీ ఆఫీస్ సీల్..
మహారాష్ట్ర ముంబయిలో శివసేన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. నాలుగు రోజుల క్రితం పార్టీ భవన్‌ను సందర్శించిన ఓ సీనియర్ పార్టీ నేతకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ కావడమే కారణం.
తమిళనాడులో 2వేలకు పైనే..
తమిళనాడులో కొత్తగా 2,516 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 39 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 64,603 మందికి వైరస్ సోకగా.. 833 మంది మరణించారు.
గుజరాత్ విలవిల
తాజాగా 549 మందికి వైరస్ సోకడం వల్ల గుజరాత్లో మొత్తం కేసుల సంఖ్య 28,429కు చేరింది. మరో 26 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,711కు పెరిగింది.
మిగతా రాష్ట్రాల్లో..
- కర్ణాటకలో తాజాగా 322 కేసులు నమోదయ్యాయి. 8మంది వైరస్‌తో మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9,721కి చేరింది. మరణాల సంఖ్య 150కు ఎగబాకింది.
- పంజాబ్‌లో మరో 162 మందికి కరోనా సోకింది. మొత్తం మరణాల సంఖ్య 105కు చేరింది.
- కేరళలో ఇవాళ 141 మంది కొవిడ్ బారినపడగా.. మొత్తం కేసుల సంఖ్య 3,451కి చేరింది. మరొకరు మరణించారు.
- కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో కొత్తగా 148 కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మృతి చెందారు.
- బంగాల్లో మరో 370 మంది కరోనా బారినపడ్డారు. మరో 11 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 580కి చేరింది.
ఇదీ చూడండి:మారుతీ సిబ్బందికి కరోనా- క్వారంటైన్ నుంచి మాయం