కరోనాపై ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ 'కొవిడ్ ఇండియా సేవా' అనే వినూత్న ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు సాయమందించడం, వైరస్‌పై తలెత్తే ప్రశ్నలకు వేగంగా సమాధానం ఇవ్వడం.. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. శిక్షణ పొందిన నిపుణులు ప్రజల ఆరోగ్య సమస్యలపై స్పందిస్తారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
కరోనాపై సహాయానికి 'కొవిడ్ ఇండియా సేవా'
దేశవ్యాప్తంగా ప్రబలుతోన్న కరోనాతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను నేరుగా తెలుసుకునేందుకు 'కొవిడ్ ఇండియా సేవా' అనే వినూత్న ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ నేడు దీనిని ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో స్పందించి, వైరస్‌పై తలెత్తే ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
కరోనాపై వేళ సహాయానికి 'కొవిడ్ ఇండియా సేవా'
వైరస్ నియంత్రణ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల అభిప్రాయాల్ని సేకరించడం, కొవిడ్ లక్షణాలున్నవారు ఎక్కడికి వెళ్లాలో తెలియకపోతే.. మార్గదర్శకాలు చేయడం ఈ ప్లాట్‌ఫాం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. సమాచారాన్ని పంచుకునే సమయంలో వ్యక్తిగత వివరాలు తెలపాల్సిన అవసరం లేదని వెల్లడించారు.