తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా కలిపిన హిందూ- ముస్లిం రక్షా బంధం! - hindhu girl tying rakhi to muslim in rajastan

రాజస్థాన్​లోని ఓ కరోనా కేర్ సెంటర్​లో చిగురించింది వారి స్నేహం. ఆ పరిచయమే ఇప్పుడు హిందూ- ముస్లిం తేడా లేకుండా అపురూపమైన అన్నాచెల్లెళ్ల బంధానికి జీవం పోసింది. హిందూ చెల్లెలు ముస్లిం సోదరుల చేతికి రాఖీ కట్టేలా చేసింది.

covid-friendship-translates-into-precious-rakshabandhan-bond-in-rajastan-barmar
కరోనా కలిపిన హిందూ-ముస్లిం రక్షా బంధం!

By

Published : Aug 3, 2020, 12:59 PM IST

కరోనా కారణంగా రాజస్థాన్, బర్మార్​లో హిందూ- ముస్లిం మధ్య సోదరభావం వెల్లివిరిసింది. బర్మార్​కు చెందిన వర్షా చౌహాన్ (హిందూ), నిషా షేక్ (ముస్లిం)లకు కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. ఒకే ఆసుపత్రిలో చేరిన వారిద్దరికీ.. కరోనా కేర్ సెంటర్ లోనే దోస్తీ కుదిరింది. చికిత్స పొందినన్ని రోజులు ఒకరికి ఒకరు తోడయ్యారు. కలిసికట్టుగా కరోనాను ఓడించి ఇళ్లకు చేరుకున్నారు. కానీ, వారి స్నేహం అక్కడే ముగిసిపోలేదు.

కరోనా కలిపిన హిందూ-ముస్లిం రక్షా బంధం!

వర్షాచౌహాన్​కు ముగ్గురూ కూతుళ్లే.. ఇక నిషాకు ఇద్దురూ కుమారులే. ఆ సంగతి తెలిసిన వర్షా తన కూమార్తెలతో కలిసి రక్షబంధన్ రోజు నిషా ఇంటికి చేరుకుంది. నిషా కుమారులకు బొట్టు పెట్టి, చేతికి రాఖీ కట్టారు వర్షా కూతుళ్లు. ఇప్పడు తన కుమారులకు కొత్త చెల్లెళ్లు దొరికారంటోంది నిషా. తమ కుమార్తెలకు రక్షగా ఇద్దరు సోదరులున్నారని వర్షా హర్షం వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి: ఈ ప్రయోగం ఫలిస్తే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేసినట్టే!

ABOUT THE AUTHOR

...view details