తమిళనాడులో కొవిడ్-19 వైరస్‌తో బాధపడుతున్న ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అదృష్టవశాత్తు శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు వైద్యులు.
ఇదీ జరిగింది..
తమిళనాడులో కొవిడ్-19 వైరస్‌తో బాధపడుతున్న ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అదృష్టవశాత్తు శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు వైద్యులు.
ఇదీ జరిగింది..
గర్భిణిగా ఉన్న ఓ కరోనా బాధితురాలిని.. చికిత్స నిమిత్తం పెరుందురై ఐఆర్టీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలోనే ఆమె ప్రసవ ఘడియలు దగ్గరపడ్డాయి. వెంటనే అత్యంత జాగ్రత్తగా శస్త్ర చికిత్స చేసి పురుడు పోశారు వైద్యులు. తల్లికి సోకిన వైరస్ బిడ్డకూ చుట్టుకుంటుందేమోనని అంతా భయపడ్డారు. కానీ, ఆ పసికందు కరోనాను జయించాడు. వైరస్‌ను కాలదన్ని పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు ధృువీకరించారు.
మూడు వారాల క్రితం మత బోధనలు చేసేందుకు అదే రాష్ట్రంలోని కొల్లంపాలయం వచ్చిన ఏడుగురు నుంచి కొందరికి వైరస్ సోకింది. ఆ బాధితుల్లో ఒకరు కిడ్నీ సమస్యతో మృతి చెందగా.. మరో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వారిని కలిసిన 54 మందికి కరోనా సోకిందని.. వారిలో ఈ గర్భిణీ ఉందని నిర్ధారించారు.
ఇదీ చదవండి:దోస్త్‌ను సూట్‌కేస్‌లో కుక్కి ఫ్లాట్‌లోకి గప్‌చుప్‌గా...